JR NTR Fans : ఈ మధ్య సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాటిని మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. వీటిపై చాలా మంది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో సీపీ సజ్జనార్ ను కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి. తమ హీరో ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు.
Read Also : Vishal : ఆ హీరో పక్కన కత్తిలాంటి ఇద్దరు హీరోయిన్లు.. మామూలుగా ఉండదా
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చేసిన పోస్టులు ఎన్టీఆర్ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని.. వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని మురళి ఫిర్యాదులో కోరారు. మనం చూస్తూనే ఉన్నాం కదా.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫొటోలను ఇష్టారీతిన అసభ్యకరంగా మార్చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పై అసభ్యకరమైన మీమ్స్ కూడా వేస్తున్నారు. అలాంటి పోస్టులను సోషల్ మీడియాలో డిలీట్ చేయాలని కోరారు. సెలబ్రిటీలను వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు.
Read Also : Nayanthara : చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ.. పిక్స్ వైరల్
