JR NTR Fans Press Meet : హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. అలాంటి వ్యక్తిని ఇలా అంటే ఊరుకుంటామా. ఆయన గురించి మాట్లాడే స్థాయా నీది. ఆయన ఒక గొప్ప నటుడు. ఆ తల్లిని ఎందుకు అన్నావు. ఆమె ఏం పాపం చేసింది. ఒక గొప్ప నటుడిని కనింది. అది తప్పా. మా ఎన్టీఆర్ మాకు నేర్పించింది. ఒక్కటే. ఎవరు ఎన్ని అన్నా సరే మన పని మనం చేసుకుంటూ పోతే ప్రజలే మనల్ని గుర్తిస్తారు అని చెప్పారు. మేం ఎన్ని సార్లు కోప్పడినా ఆయన వద్దు వద్దు ప్రజల మనసులు గెలుచుకుంటే చాలు అంటుంటారు.
Read Also : JR NTR : ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అమ్మాయి..
టీడీపీ అంటేనే స్త్రీలను గౌరవించే పార్టీ. అలాంటి పార్టీలో ఉండటానికి ఎమ్మెల్యే ప్రసాద్ అర్హుడు కాదు. మేం పార్టీ అధిష్టానానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రసాద్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే. లేదంటే మేం ఊరుకోం. గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్ ను ఎంతో మంది అవమానిస్తున్నారు. ఇన్నేళ్లు ఊరుకున్నాం. ఇక ఊరుకునేది లేదు. మేం కదిలి వస్తే ఎలా ఉంటుందో చూస్తారు. టీడీపీలో చాలా మంది ఎదిగిన తర్వాత నందమూరి కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎలా పడితే అలా అవమానిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. అలాంటప్పుడు మీరు టీడీపీ నుంచి వెళ్లిపోండి. ఇలాంటి వారిని టీడీపీ అధిష్టానం వదిలేయకూడదు. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేశారు అభిమానులు.
Read Also : Fauji : ప్రభాస్ లుక్ షేర్ చేస్తే జైలుకే.. ఫౌజీ టీమ్ వార్నింగ్
