Site icon NTV Telugu

Jr NTR: బాలీవుడ్ బడా నిర్మాతతో తారక్ సినిమా.. ఇదే సాక్ష్యం!

Jr Ntr Bollywood Movie

Jr Ntr Bollywood Movie

Jr NTR Deal With Popular Bollywood Producer: ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీఆర్ క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. ఆ సినిమాకి ముందు రీజనల్ హీరోగా ఉన్న తారక్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా అవతరించాడు. దీంతో.. ఈ నటుడితో సినిమాలు చేసేందుకు ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలు ఎగబడుతున్నాయి. తారక్ డేట్స్ కోసం క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్‌కి చెందిన ఓ పెద్ద నిర్మాణ సంస్థ అతనితో ఓ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ ఆ సంస్థ ఏది? అని అనుకుంటున్నారా! మరేదో కాదు.. టీ-సిరీస్ ఫిల్మ్స్! NTR30 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ అధిపతి భూషణ్ కుమార్ తళుక్కుమనడం వల్లే.. ఈ ప్రచారం పుట్టుకొచ్చింది.

Fire accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కారులోనే సెక్యూరీటి గార్డ్ సజీవ దహనం

సాధారణంగా నిర్మాతలు.. మరీ ముఖ్యంగా భూషణ్ కుమార్ లాంటి పెద్ద నిర్మాత సినిమా ఈవెంట్లకు ఊరికే హాజరు అవ్వరు. తప్పకుండా తెరవెనుక ఏదో ఒక డీల్ ఉండనే ఉంటుంది. బహుశా అతడు NTR30 సినిమాకి సంబంధించిన హిందీ హక్కుల్ని సొంతం చేసుకున్నాడో? లేక తారక్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడో పక్కా సమాచారం లేదు కానీ.. NTR30 లాంచ్ ఈవెంట్‌లో అతడు కనిపించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. భూషణ్ కుమార్ ఇప్పటికే ప్రభాస్‌తో ఒక సినిమా, అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో మరో సినిమాని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌కి కూడా ఆర్ఆర్ఆర్ కారణంగా హిందీ గడ్డపై భారీ క్రేజ్ వచ్చింది కాబట్టి.. అతనితోనూ ఓ ప్రాజెక్ట్ చేయడం పక్కా అనిపిస్తోంది. అదే జరిగితే.. బాలీవుడ్‌లో తారక్ మార్కెట్ పెరిగేందుకు ఈ ప్రాజెక్ట్ తప్పకుండా సహకరిస్తుందని చెప్పుకోవచ్చు.

Child Marriage: బాల్యవివాహం కలకలం.. సాయిబాబా గుట్టు రట్టు

ఇదిలావుండగా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ రీసెంట్‌గా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌కి టెక్నీషియన్స్‌తో పాటు తారక్, జాన్వీ కపూర్‌లు విచ్చేశారు. జనతా గ్యారేజ్ తర్వాత తారక్, కొరటాల కాంబోలో మూవీ కావడంతో.. NTR30 పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈవెంట్‌లో ఇది ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోందని, భయమంటే ఏంటో తెలియని మృగాళ్లను భయపెట్టించే ఓ హీరో కథ ఇదని కొరటాల చెప్పడంతో.. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Exit mobile version