NTV Telugu Site icon

Jr NTR Look: అదిరిపోయే లుక్‌లో జూనియర్‌ ఎన్టీఆర్.. ఏమున్నాడ్రా బాబూ!

Jr Ntr New Looks

Jr Ntr New Looks

Jr Ntr Dashing Look for SIIMA Awards goes viral in Social Media: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ రేంజ్‌ పాన్‌ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయిందని ప్రత్యేకంగా చూపాల్సిన అవసరం లేదు. ఈ మధ్యే ఈ మూవీ అమెరికా, జపాన్‌లలోనూ దుమ్ము రేపిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు లభించగా ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్30 మూవీ షూట్ లో బిజీగా ఉన్న తారక్ ఆ మధ్య సైమా అవార్డులకు వెళ్లి వచ్చాడు. ఇక అవార్డు అందుకునే రోజు ఆయన సూట్ అవుట్ ఫిట్ ఫోటోలను ఆయన వాట్సాప్ ఛానల్ లో సెర్ చేశాడు . ఇక సూట్‌ వేసుకున్న తారక్‌ చాలా హ్యాండ్సమ్‌, క్లాస్‌ లుక్‌లో అమ్మాయిల మనసు దోచుకునేలా ఉన్నాడని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ మేకోవర్‌లో ఫార్మల్‌ సూట్, గడ్డంతో అతడు కెమెరాలకు పోజులిచ్చాడు.

Kangana: అడిగి మరీ ‘చంద్రముఖి’ని అయ్యా.. అసలు విషయం చెప్పిన కంగనా

ఇక తారక్‌ ఈ కొత్త లుక్‌లో కనిపించడానికి ఆలిమ్‌ హకీమే కారణం అని చెప్పొచ్చు. ఇక మరోపక్క అయితే దేవర కొత్త షూటింగ్ షెడ్యూల్‌ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌, ఎన్టీఆర్ మధ్య ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఇక దేవర పేరుతొ తెరకెక్కుతున్న ఈ ఈ పాన్-ఇండియా మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్‌ హిట్‌గా నిలవగా ఆ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్‌స్థాయిలో ఉండేలా బ్రాడ్ మిన్నిచ్ పనిచేస్తున్నారు.

Show comments