Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Jr Ntr Creates New Record With Rrr Movie

Young Tiger NTR: యువ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ అరుదైన రికార్డు

Published Date :March 26, 2022 , 10:28 pm
By Ramesh Nalam
Young Tiger NTR: యువ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ అరుదైన రికార్డు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరోలు రెండేళ్లకు లేదా మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల కాలంలో తన తోటి హీరోలకు సొంతం కాని ఓ రికార్డును జూనియర్ ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఇప్పటి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ వరకు వరుసగా ఆరు హిట్లు కొట్టిన ఘనతను ఎన్టీఆర్ సాధించాడు. దీంతో ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ నమోదైంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ లాంటి వరుస హిట్లు ఎన్టీఆర్ సాధించాడు. వీటిలో ఏ సినిమా కూడా అభిమానులను నిరాశపరచలేదు. టెంపర్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ వరుస ఫ్లాప్‌లను చవిచూశాడు. రామయ్య వస్తావయ్యా, రభస లాంటి డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు.

ఎన్టీఆర్‌తో పోల్చి చూస్తే యువ స్టార్ హీరోల్లో మరెవ్వరూ వరుసగా ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా ఆరు హిట్లను సాధించలేకపోయారు. పవన్ కళ్యాణ్ చివరి ఆరు సినిమాలు.. గోపాల గోపాల, సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాత వాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్. వీటిలో సర్ధార్ గబ్బర్ సింగ్, అజ్ఞాత వాసి సినిమాలు డిజాస్టర్లు. అయితే పవన్ తన కెరీర్ ప్రారంభంలో మాత్రం వరుస హిట్లను అందుకున్నాడు.

మహేష్‌బాబు విషయానికి వస్తే.. అతడి చివరి ఆరు సినిమాలు.. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు. వీటిలో బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి డిజాస్టర్లు ఉన్నాయి. ప్రభాస్ విషయానికి వస్తే.. అతడి చివరి ఆరు సినిమాలు.. రెబల్, మిర్చి, బాహుబలి, బహుబలి-2, సాహో, రాధేశ్యామ్. వీటిలో రెబల్, సాహో, రాధేశ్యామ్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి.

అల్లు అర్జున్‌ విషయానికి వస్తే అతడి చివరి ఆరు సినిమాలు.. సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అలవైకుంఠపురంలో, పుష్ప వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి డిజాస్టర్ మూవీ ఉంది. అటు హీరో రామ్‌చరణ్‌ చివరి ఆరు సినిమాలలో గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ, ధృవ, రంగస్థలం, వినయ విధేయ రామ, ఆర్.ఆర్.ఆర్ ఉండగా.. వీటిలో బ్రూస్‌లీ, వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ మూవీలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest movie news
  • record
  • RRR movie
  • six hits in a row
  • Tollywood

తాజావార్తలు

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions