Site icon NTV Telugu

గిల్లితే గిల్లించుకోవాలి.. తారక్, చరణ్ ఫన్నీ వీడియోపై మీమ్స్ వైరల్

RRR movie

RRR movie

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన తారక్, చరణ్ లా స్నేహబంధమే కనిపిస్తోంది. ఈరోజు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొంటూ.. జక్కన్నను, అలియాను ఏడిపించిన తీరు నవ్వులు పూయిస్తోంది. ఇక మరుముఖ్యంగా ఎన్టీఆర్ అల్లరి పనులు ప్రెస్ మీట్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. రాజమౌళి మాట్లాడుతుంటే మధ్యలో గిల్లడం, అలియాను ఏడిపించడం, చెర్రీని ఆటపట్టించడం లాంటివి చేసి ప్రెస్ మీట్ కి హైప్ తెచ్చాడు.

ఇక చివర్లో ఇద్దరు స్టార్ హీరోలు ఫోటోలకు పోజ్ ఇస్తుండగా చెర్రీ వెనుక నుంచి తారక్ ని గిల్లడం, తారక్ ఒక్కసారిగా ఎగిరి పక్కకి జరగడం బెస్ట్ మూమెంట్ గా మారింది. ఇద్దరు స్టార్ హీరోలు తమ హోదాని, స్టార్ డమ్ ని పక్కన పెట్టి ఇగోలు లేకుండా కలిసిపోవడం వీరిద్దరికే చెల్లింది. ఇలాంటి స్నేహ బంధం ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇకపోతే ఈ ఫన్నీ వీడియో నెట్టింట విఉరల్ గా మారింది.

ఇక మీమర్స్ అయితే ఈ వీడియోపై మీమ్స్ వేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. పోకిరిలోని ప్రకాష్ రాజ్ డైలాగ్ “గిల్లితే గిల్లించుకోవాలి.. జక్కన్నకు చెప్పకూడదు” వాడుతూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ మీమ్స్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఎన్టీఆర్ అల్లరి చేష్టలు.. చిన్నపటినుంచి అంతే అంటూ గతంలో తారక్ చేసిన అల్లరి పనులను విదేవుగా మార్చి మరి కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/GJ_STR_Ajith/status/1469653054387417089?s=20

https://www.instagram.com/p/CXVMM-ipVv3/

https://www.instagram.com/p/CXVcThlJL-f/

Exit mobile version