Jeevitha Rajasekhar Birthday Special: రాజశేఖర్ విజయనాయిక… జీవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలోని అరుదైన జంటల్లో జీవిత- రాజశేఖర్ సైతం చోటు సంపాదించారు. అంతకు ముందు నటిగా రాణించిన జీవిత, తరువాతి రోజుల్లో రాజశేఖర్ హిట్ పెయిర్ గా అలరించారు. ఆ పై జీవిత కాస్తా జీవితా రాజశేఖర్ అయ్యారు. అప్పటి నుంచీ తన పతిదేవుని విజయానికై జీవిత సైతం తనవంతు కృషి చేశారు. అందువల్లే రాజశేఖర్ విజయం వెనుక ఉన్నది జీవిత అని సినీజనం సైతం ఇట్టే చెప్పేస్తారు.
జీవిత 1966 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం చెన్నైలోనే సాగాయి. మాతృభాష తెలుగయినా, ఆమెకు ఆరంభంలో తమిళ చిత్రాలలోనే అవకాశాలు లభించాయి. టి.రాజేందర్ తెరకెక్కించిన ‘ఉరవై కాద కిలి’ చిత్రంతో తొలిసారి జీవిత తెరపై కనిపించారు. కె.వాసు రూపొందించిన ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ తెలుగు చిత్రంతో తెలుగువారికి పరిచయం అయ్యారు జీవిత. ఆ తరువాత అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ నటిస్తూ సాగారు. “బావామరదుల సవాల్, అన్నాచెల్లెలు, జానకిరాముడు” వంటి చిత్రాలలో జీవిత నటించారు. రాజశేఖర్ తో జీవిత నటించిన “తలంబ్రాలు, ఆహుతి, స్టేషన్ మాస్టర్, అంకుశం, మగాడు” వంటి చిత్రాలు జనాన్ని అలరించాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అంకుశం’ బ్లాక్ బస్టర్ గా నిలచింది. 1991లో జీవిత, రాజశేఖర్ పెళ్ళాడారు. ఆ తరువాత నుంచీ జీవిత ఇంటికే పరిమితమై, భర్త విజయం కోసం కృషి చేస్తూ వచ్చారు. రాజశేఖర్ హీరోగా నటించిన కొన్ని చిత్రాలకు ఆమె నిర్మాణ బాధ్యతలూ నిర్వహించారు.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేషు’ సినిమాతో జీవిత దర్శకురాలు అయ్యారు. ఆ పై రాజశేఖర్ హీరోగా “సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్” వంటి చిత్రాలను తన దర్శకత్వంలో తెరకెక్కించారామె. రాజశేఖర్, జీవిత ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రీజనల్ ఆఫీసర్ గా జీవిత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జీవిత – రాజశేఖర్ దంపతులకు శివాని, శివాత్మిక – ఇద్దరు కూతుళ్ళు. వారు కూడా కన్నవారి బాటలోనే పయనిస్తూ నటనలో రాణిస్తున్నారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..