NTV Telugu Site icon

JD Chakravarthy: ‘అంతం కాదిది ఆరంభం’ పోస్టర్ లాంచ్!

Aka

Aka

Movie Poster: ఇషాన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ నిర్మిస్తున్న సినిమా ‘అంతం కాదిది ఆరంభం’. ఈ చిత్ర టైటిల్ లుక్ ‌పోస్టర్‌ని టాలెంటెడ్ యాక్టర్ జె. డి. చక్రవర్తి ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “టైటిల్ చూడగానే.. అరే ఇంత మంచి టైటిల్‌ని ఇప్పటి వరకు అంతా మిస్ అయ్యారేంటి? అని అనిపించింది. అందుకే నిర్మాత సిరాజ్‌ని టైటిల్ రిజిస్టర్ చేయించారా? అని అడిగాను. ఒకవేళ చేయించకపోతే నేను కొట్టేసేవాడిని. కథలు కొట్టేయడం కామన్.. ఇవాళ సరైన టైటిల్ దొరకడం లేదు. ‘అంతం కాదిది ఆరంభం’ అనేది పాజిటివ్ అండ్ అద్భుతమైన టైటిల్. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ కృష్ణ గారు సినిమా చేశారు. విజయనిర్మల‌గారు ఆ సినిమాకి డైరెక్టర్. హైదరాబాద్ సుదర్శన్ 70MMలో రిలీజైంది. నేనప్పుడు ఆ థియేటర్‌లో సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అలాగే.. అన్నం అంతా చూడక్కరలేదు.. అనే సామెతలా ఈ టైటిల్ చూస్తుంటే ఇది మంచి సినిమా అని ఖచ్చితంగా నమ్మవచ్చు. న్యూ టీమ్ అంతా కలిసి చేస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేసిన జె. డి. చక్రవర్తికి దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. ఇషాన్, ప్రణాళి, రాకెట్ రాఘవ, ప్రవీణ్, కరాటే కళ్యాణి, గీతాసింగ్, నాగ మహేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంభాషణలు రాజేంద్ర, భరద్వాజ్ సమకూర్చగా, వినోద్ యాజమాన్య సంగీతాన్ని అందించారు.

Show comments