Jayaram Roles in telugu movies become hot topic: మలయాళ నటుడు జయరామ్ ఈ మధ్యకాలంలో బడా తెలుగు సినిమాలలో కీలకమైన పాత్రలలో కనిపిస్తున్నాడు. నిజానికి జయరాం ఒకప్పుడు మలయాళంలో హీరోగా అనేక సినిమాలు చేశాడు తర్వాత తమిళం లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలో నటించాడు. ఇక ప్రస్తుతానికి ఆయన తెలుగులో కూడా బిజీ అవుతున్నాడు. ముందుగా ఆయన 2018 వ సంవత్సరంలో రిలీజ్ అయిన అనుష్క శెట్టి భాగమతి అనే సినిమాలో ఈశ్వర్ ప్రసాద్ అనే పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత అల వైకుంఠపురంలో రామచంద్ర అని అల్లు అర్జున్ తండ్రి పాత్రలో కనిపించి ఒక్కసారిగా మెరిశాడు. తర్వాత రాధే శ్యామ్, ధమాకా, రావణాసుర, ఖుషి, హాయ్ నాన్న, గుంటూరు కారం సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలలో కనిపించాడు.
Nandamuri Balakrishna: హనుమాన్ ను వీక్షించిన బాలయ్య.. ఏమన్నాడంటే.. ?
అయితే ఇప్పుడు ఈయన గురించి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే ఆయన అలవైకుంఠపురంలో సినిమా మొదలు హాయ్ నాన్న, గుంటూరు కారం సినిమాల్లో భార్యలతో గొడవపడి దూరంగా ఉండే భర్త పాత్రలో కనిపించాడని అంటున్నారు. నిజానికి ఆయన దాదాపు 7 సినిమాల్లో తెలుగులో చేస్తే అందులో మూడు సినిమాల్లోనే ఇలాంటి పాత్రలో కనిపించాడు కానీ సోషల్ మీడియాలో మాత్రం కాస్త ఆయన ఇలాంటి పాత్రలు తగ్గిస్తే మంచిది అంటూ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అల వైకుంఠపురంలో సినిమాలో తన భార్య పాత్రధారి టబుతో గొడవపడి తర్వాత కలిసే పాత్రలో ఆయన కనిపిస్తాడు. ఇక హాయ్ నాన్న సినిమాలో కూడా విడాకులు తీసుకున్న భర్త పాత్రలోనే కనిపిస్తాడు. ఇక గుంటూరు కారం సినిమాలో కూడా రమ్యకృష్ణకి దూరం అయి పోయిన వ్యక్తిగానే సినిమా మొత్తం కనిపిస్తాడు చివరిలో ఆమె కలుస్తుందనుకోండి అది వేరే విషయం.