Jayamma Panchayathi ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల నటిస్తున్న తాజా చిత్రమన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అయితే తాజాగా Jayamma Panchayathi సినిమా విడుదల తేదీని ఫన్నీ వీడియోతో అనౌన్స్ చేశారు. సుమ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ వీడియోలో సినిమా విడుదలకు సంబంధించి ఫన్నీ కాన్వర్జేషన్ సాగింది. ఇందులో తన సినిమాను విడుదల చేయడానికి సరైన తేదీని ఎంచుకోవదానికి సంబంధించి జయమ్మ పడిన గందరగోళం కన్పిస్తోంది. ఆమె చివరకు ఏప్రిల్ 22ని విడుదల తేదీగా నిర్ణయించింది.
Read also : Boyapati Srinu : రతనాల సీమపై మాస్ డైరెక్టర్ ఆవేశపూరిత స్పీచ్
మొత్తానికి ఒక మంచి ఫ్యామిలీ అండ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో సుమ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. దశాబ్దాల నుంచి బుల్లితెరను ఏలేస్తున్న సుమ Jayamma Panchayathiతో మళ్ళీ టాలీవుడ్ రీఎంట్రీకి సిద్ధమైంది. ఇంతకుముందు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా లీడ్ గా పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
పంచాయితీ తుది తీర్పు వచ్చేసిందహో 🗣📢
— Jayamma Panchayathi (@JPTFilm) March 14, 2022
The Date is Locked to witness @ItsSumaKanakala in Action on Big Screens😍#JayammaPanchayathi World-Wide Grand Release on 𝐀𝐏𝐑𝐈𝐋 𝟐𝟐𝐧𝐝, 𝟐𝟎𝟐𝟐💥🥳@mmkeeravaani @VijayKalivarapu @PrakashBalaga @vennelacreation @adityamusic pic.twitter.com/zQqX7DZYL6