పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రైలర్ బాగుందంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన పవన్, సినిమా హిట్ కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్ లో భర్త అనారోగ్యం పాలయ్యేంత వరకు సంతోషకరమైన జీవితాన్ని గడిపే సాధారణ గృహిణిగా కన్పించింది సుమ. అయితే ఒకసారి భర్త మంచాన పడగానే జయమ్మ పంచాయతీకి వెళ్తుంది. అసలు ఆమె పంచాయతీకి ఎందుకు వెళ్ళింది ? సమస్య ఏమిటి? జయమ్మ పంచాయతీని పక్కన పెట్టేంతగా ఆ ఊరికి వచ్చిన సమస్య ఏమిటి? జయమ్మ పంచాయతీకి ఎలా పరిష్కారం లభించింది ? అనే డౌట్స్ తో కూడిన ఆసక్తిని ట్రైలర్ తో ప్రేక్షకుల్లో పెంచేశారు మేకర్స్.
Read Also : Hanuman Jayanthi : హనుమతో చెర్రీ… థ్రిల్లింగ్ వీడియో షేర్ చేసిన చిరు !
ఇక జయమ్మ కుటుంబం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఒక పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కథలో మనసుకు హత్తుకునే ఎమోషన్ ను, అలాగే సుమకు మారు పేరైన ఎటకారాన్ని కూడా కలిపారు. ఏదైతేనేం ట్రైలర్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది సుమ. ఈ మూవీని వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. బలగ ప్రకాష్ నిర్మిస్తున్న విలేజ్ డ్రామా “జయమ్మ పంచాయితీ” చిత్రం మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
