NTV Telugu Site icon

Jawan: డెత్ కు డీలర్.. అదిరిపోయిన విజయ్ సేతుపతి లుక్

Vijay

Vijay

Jawan: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాలో జవాన్ ఒకటి. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ప్రివ్యూ ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో విలన్ గా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. హీరో, విలన్, సపోర్టివ్ రోల్.. ఏదైనా కానీ, విజయ్ వద్దకు రానంత వరకే.. ఒక్కసారి వచ్చిందా.. అసలు ఆయన నటన గురించి.. ఆ పాత్ర గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇక తాజాగా మేకర్స్ విజయ్ సేతుపతి లుక్ ను రిలీజ్ చేశారు.

Tillu Square: రాధికాతో అంత జరిగినా కూడా సిగ్గు రాలే టిల్లు అన్నకు..

పోస్టర్ లో విజయ్ అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. ఇక డీలర్ ఆఫ్ డెత్ అని పెట్టిన క్యాప్షన్ అయితే అదిరిపోయింది. ఈ ఒక్క డైలాగ్ తో విజయ్ క్యారెక్టర్ ను ఓ రేంజ్ లో చూపించేశారు. షారుఖ్ కు ధీటుగా ఈ పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా అన్ని భాషల్లో సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో షారుఖ్ – విజయ్ సేతుపతి మధ్య జరిగే సన్నివేశాలు అభిమానులను ఈలలు పెట్టించేవిగా ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు. మరి ఈ సినిమా .. విజయ్ సేతుపతికి ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.

Show comments