Jawan: షారుఖ్+ లవ్ సాంగ్స్.. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది బ్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ కు ధీటుగా విజయ్ సేతుపతి విలనిజాన్ని చూపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొన్నీమధ్య రిలీజ్ అయిన దుమ్ము దులిపేలా సాంగ్.. నిజంగానే దుమ్ము దులిపేసింది. వందకు పైగా డ్యాన్సర్స్ మధ్యలో షారుఖ్ హుక్ స్టెప్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఇక ఈ సాంగ్ మంచి గుర్తింపు అందుకోవడంతో ఈసారి ఒక లవ్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఛలోనా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. షారుఖ్+ లవ్ సాంగ్స్.. ఇప్పుడే కాదు.. మొదటి నుంచి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.. రొమాంటిక్ సాంగ్ లో షారుఖ్ చూపించే హావభావాలు వేరే లెవల్ అని చెప్పొచ్చు.
Hyper Aadi: వర్షిణితో హైపర్ ఆది పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక ఈ ఛలోనా సాంగ్ లో కూడా నయన్ తో షారుఖ్ రొమాన్స్ అదిరిపోయింది. మొదటి సీన్ లోనే నయన్ మెడలో తాళి కనిపించడంతో.. వీరు భార్యాభర్తలుగా ఇందులో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ భావాలను ఎంతో అద్భుతంగా రాసాడు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను ఆదిత్య ఆర్కే, ప్రియామాలి ఆలపించారు. విజువల్స్ సైతం ఎంతో అద్భుతంగా ఉంది. ఇక షారుఖ్ చేతులు చాచి.. స్టెప్ వేస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో షారుఖ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!