NTV Telugu Site icon

Jawan Movie: జవాన్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

Jawan New Release Date

Jawan New Release Date

Jawan Movie Unit Announced New Release Date: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ‘జవాన్’ అనే సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే.. ఆ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయని, ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ కోసం మరింత సమయం అవసరం ఉంటుందని, తద్వారా ఈ సినిమా వాయిదా పడొచ్చని.. కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మధ్యలో ఓసారి ఈ సినిమా వాయిదా పడకపోవచ్చన్న పుకార్లు చక్కర్లు కొట్టాయి కానీ, ఆ తర్వాత తప్పకుండా వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. ఇప్పుడు మేకర్స్ ఆ వార్త నిజమేనని క్లారిటీ ఇచ్చారు. తమ సినిమాని వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

Virat-Gambhir Fight: కోహ్లీ తిట్టిన ఆ బూతే.. గొడవకు ఆజ్యం పోసిందా?

తాజాగా 18 సెకన్ల పాటు ఒక చిన్న టీజర్ విడుదల చేసిన మేకర్స్.. అందులో తమ ‘జవాన్’ సినిమాను సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇదే టీజర్‌లో.. షారుఖ్ ఖాన్ జావెలిన్ త్రో విసురుతూ కనిపించాడు కూడా! అంతకుమించి ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. కేవలం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసమే ఈ వీడియోని ప్రత్యేకంగా విడుదల చేసినట్టు తెలుస్తోంది. తొలుత ఈ సినిమాను జూన్ 2వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ.. ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా, సెప్టెంబర్ 7కి వాయిదా వేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైనర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదొక క్రేజీ కాంబో కావడం, షారుఖ్ కనీవినీ ఎరుగని సరికొత్త అవతారంలో నటిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్