Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ కిడ్స్ కేవలం నటనకే పరిమితం కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకత్వంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో షారుక్, సూర్య కిడ్స్ డైరెక్షన్ లో తమ ప్రతిభ చాటుకున్నారు. కొడుకు కోసం షారుక్ అన్ని తానై వ్యవహరించాడు. ఇప్పుడు ఇదే జాసన్ విజయ్ విషయంలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నటుడిగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తండ్రి సపోర్ట్‌తో భారీ తారాగణాన్ని సెట్లోకి తెచ్చిన ఆర్యన్ ‘ది బాడాస్ ఆఫ్ బాలీవుడ్‘ వెబ్ సిరీస్‌తో తన సత్తా చాటుకున్నారు. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య-జ్యోతికల కుమార్తె దియా సూర్య చాలా చిన్న వయసులోనే దర్శకత్వంపై మక్కువ పెంచుకుంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ‘లీడింగ్ లైట్‘ అనే డాక్యుమెంటరీని రూపొందించి దర్శకురాలిగా మారింది.
దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ కూడా తండ్రి బాటలో నటన వైపు కాకుండా దర్శకత్వం వైపు మొగ్గు చూపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘సిగ్మా‘ (Sigma) అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఏమైందనే దానిపై క్లారిటీ లేదు. విజయ్ – జాసన్ మధ్య మాటలు కూడా లేనట్టు కోలీవుడ్ టాక్. ఇటీవల జేసన్ సంజయ్ సోషల్ మీడియాలో తన తండ్రి విజయ్ను అన్‌ఫాలో చేయడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన వ్యక్తిగత జీవితంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్లే కొడుకు ఇలా స్పందించాడని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తండ్రి సపోర్ట్ లేకుండానే జేసన్ తన కెరీర్‌ను నిర్మించుకోబోతున్నాడా? లేదా ఇదంతా కేవలం వదంతులేనా? అన్నది కాలమే నిర్ణయించాలి.
Also Read
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!