Janhvi Kapoor : జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందంటూ అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. జాన్వీకి ఏ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. శ్రీదేవి కూతురుగా వచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని విషయాలను బయట పెట్టింది. నేను గతంలో చాలా సార్లు పెళ్లి అయిందనే అబద్దాలు చెప్పాను. ఇండియాలో ఉన్నప్పుడు కాదు.. వేరే దేశాల్లో ఉన్నప్పుడు పెళ్లి అయిందని చెప్పేదాన్ని. అమెరికాలో ఉన్నప్పుడు చాలా మంది వెయిటర్లు రెస్టారెంట్లలో వాళ్ల నెంబర్లు నాకు ఇచ్చేవాళ్లు.
Read Also : Telangana Floods : సందీప్ రెడ్డి సాయం.. టాలీవుడ్ వాళ్లకు ఏమైంది..?
నేను ఏం మాట్లాడక ముందే.. ఫుడ్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టేవాల్లు. ఓ సారి అమెరికాలో ఓరీతో ఉన్నప్పుడు కొందరు వెయిటర్లు అలా ప్రవర్తించారు. దాంతో ఓరీతో నాకు పెళ్లి అయిందని అబద్దం చెప్పా. వాళ్లంతా నన్ను పట్టించుకోవడం మానేశారు అంటూ నవ్వేసింది ఈ బ్యూటీ. ఓరీ మోడల్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటూ బాగా ఫేమస్ అయ్యాడు. జాన్వీకపూర్ కు ఓరీ బెస్ట్ ఫ్రెండ్. జాన్వీకపూర్ కొన్నేళ్లుగా శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తరచూ ఇద్దరూ బయట తిరుగుతున్నారు. కానీ వీరి రిలేషన్ ను మాత్రం బయట పెట్టట్లేదు. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం మనవడు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
Read Also : Rangaraj : ఆరు నెలల గర్భిణితో హీరో పెళ్లి.. చివరకు భారీ ట్విస్ట్
