Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదంపై సినీ నటి జాన్వీ కపూర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న లేఖ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, శరీర హక్కులు, డిజిటల్ భద్రతపై ఆమె ప్రశ్నలు సంధించారు. మహిళల అనుమతి లేకుండా కల్పిత కంటెంట్‌ను ప్రచారం చేయడం నేరపూరిత ధోరణి మాత్రమే కాదు, అది లైంగిక దాడితో సమానమైన చర్య. చిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో ఈ రకమైన వేధింపులను ఎదుర్కొంది. మహిళ ఐదు రోజులు వరుసగా ‘సరే’ అని చెప్పి, ఆరో రోజు ‘వద్దు’ అని చెబితే, ఆ తిరస్కరణను కచ్చితంగా గౌరవించాల్సిందేనని జాన్వీ స్పష్టం చేశారు. మహిళ ఏ దుస్తులు వేసుకున్నా, ఏ కోణంలో కెమెరా పెట్టి అసభ్యంగా చిత్రీకరించే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. సమాజంలో మహిళల భద్రత కోసం కేవలం “కూతుళ్లను కాపాడుకోండి” అని చెప్పడం పరిష్కారం కాదని ఆమె విమర్శించారు. ఇతరుల హద్దులను ఉల్లంఘించే హక్కు తమకు ఉందనే భావజాలాన్ని సమాజం నుంచి సమూలంగా తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
తాను ఎదుర్కొన్న ఏఐ వీడియోలు ఒక భాగం మాత్రమేనని, మహిళగా నిత్యం ఎదురయ్యే తీర్పులు, చూపులు, శారీరక భయాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి మరింత విస్తరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై గళమెత్తి, అండగా నిలిచినందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సమస్యపై స్పందించి, తప్పును తప్పని ఎత్తిచూపిన మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళను ఒక మనిషిగా గుర్తించి గౌరవించడం చాలా పెద్ద కోరికేమీ కాదని చెబుతూ, “ఆమె శరీరం, ఆమె ప్రతిష్ట, ఆమె సరిహద్దులు, ఆమె ఎంపిక” అనే నినాదంతో ఆమె తన స్పందనను ముగించారు.
Also Read
- Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
తాజావార్తలు
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!