Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికి ఎంతో మంది అభిమానులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఒక పెళ్లి వేడుకకు దుబాయ్ వెళ్లిన ఆమె బాత్ టబ్ లో కాలుజారి పడి ప్రాణాలను విడిచింది. అయితే శ్రీదేవి అంత నీరసంగా మారాడనికి కారణం భర్త బోనీ కపూరే అంట. ఈ విషయం స్వయాన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చెప్పడం గమనార్హం. ఇటీవల పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ “నాన్న ఎక్కువగా సిగరెట్లు తాగేవారు. ఎవరు చెప్పిన వినేవారు కాదు.. నేను, చెల్లి ఉదయాన్నే లేచి ఆ సిగరెట్లను కట్ చేసేవాళ్ళం.. లేకపోతే అందులో టూత్ పేస్ట్ వేసి చెడిపోయేలా చేశేవాళ్ళం.
ఇక అమ్మ ఎంతో చెప్పి చూసింది. కానీ నాన్న మాత్రం సిగరెట్లు మానలేదు. దీంతో అమ్మ.. నాన్న సిగరెట్లు మానేవరకు మాంసాహారం ముట్టనని శపథం చేసింది. ఆమె ఆరోగ్యం చెడిపోయి నీరసంగా మారిపోయింది. డాక్టర్లు బలం కోసం మాంసాహారం తినాలని చెప్పినా కూడా అమ్మ వినలేదు. ఇప్పుడు ఈ విషయంలో నాన్న బాధపడుతూ ఉంటరు. నాకోసమైన సిగరెట్లు మానేస్తాను అని చెప్పారు” అని చెప్పుకొచ్చింది. అంటే ఆరోగ్యం బాగోకపోయిన, భార్యను బతికుంచుకోవడం కోసం బోనీ సిగరెట్లు మాత్రం మానలేదు అంటే.. సిగరెట్లకు బోనీ ఎంత బానిసగా మారాడో తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన తరువాత డాక్టర్లు చెప్పినట్లు మాంసాహారం తిని ఉంటే.. శ్రీదేవి ఆరోగ్యంగా ఉండేవారు. నీరసంతో కానీ, అనారోగ్యంతో కానీ ఆమె బాత్ టబ్ వద్ద జారీ పడేది కాదని, అంతా బోనీ వలనే అనికామెంట్స్ పెడుతున్నారు.
