Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ.. సినిమా రిలీజ్ అవ్వకముందే అభిమానులను అలరిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామకు అస్సలు అందాలను దాచుకొనే అలవాటు లేదాయే. నిత్యం చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అయితే ఎద అందాలు.. లేకపోతే థైస్ అందాలతో కుర్రకారును పిచ్చెకిస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది పువ్వులో దాగిపోయి కనిపించింది. అదేనండీ.. ఫ్లోరల్ డ్రెస్ లో జాన్వీ మెరిసింది. అందమైన రోజా పూలు తీర్చిదిద్దినట్లు ఉన్న టైట్ డ్రెస్ లో జాన్వీ పరువాల విందు చేస్తోంది. ముఖ్యంగా ఎద వద్ద రోజా పూలు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. ఒక పువ్వు.. రోజాపూలను ధరించిందా అనుకొనేలా జాన్వీ అందం మెరిసిపోతుంది. దీంతో అభిమానులు హా ..మాకు ఆ రోజా పూలే కావాలి అంటూ.. వెంకీ సినిమాలో భరత్ మారాం చేసినట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
SKN: మూడేళ్లు ఎన్నో అవమానాలను భరించాం.. కష్టపడ్డాం.. సాధించాం!
ఇక జాన్వీ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవరాలో నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానులతో పాటు ఆమె కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే .. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో నటించాలని దేవుడ్ని కోరుకున్నాను అని చెప్పడంతో అమ్మడిపై ఎన్టీఆర్ అభిమానులు.. చిన్నదానిపై ఓ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే .. జాన్వీ రేంజ్ టాలీవుడ్ లో పెరిగిపోతుంది. ఒకవేళ.. ప్లాప్ టాక్ తెచ్చుకుంటే.. ఇప్పటికే ఒక హిట్ ఇచ్చి మళ్లీ బాలీవుడ్ వెళ్ళిపోయిన హీరోయిన్స్ లిస్ట్ లో మిగిలిపోతుంది. మరి ఈ చిన్నది టాలీవుడ్ లో ఎలాంటి పొజిషన్ లో ఉంటుందో చూడాలంటే.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.