యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ నటించబోతోంది అని గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రూపొందనున్నట్టు సమాచారం. ఈ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇందులో హీరోయిన్ గురించి ఇప్పటికే ఇంటర్నెట్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ దివా జాన్వీ కపూర్ నటించనుందని వార్తలు వస్తున్నాయి.
Read Also : దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు… చిక్కుల్లో హీరోయిన్
ఎన్టీఆర్, బుచ్చి బాబుల చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వారు జాన్వీని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. జాన్వీ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని దర్శకుడు భావిస్తున్నాడని, అందుకే మేకర్స్ జాన్వితో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. అయితే జాన్వీ ఈ సినిమాలో నటిస్తుందో లేదో వేచి చూడాలి.
జాన్వీ కపూర్ అరంగేట్రం గురించి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు . త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ‘ఎన్టీఆర్ 30’, పూరి జగన్నాధ్ చిత్రం ‘జనగణమన’తో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తుందని గతంలో కూడా బలమైన వార్తలు వచ్చాయి. జాన్వీ కపూర్ సౌత్ అరంగేట్రం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆమెను తెలుగు, తమిళ సినిమాలో చూడాలని సినీ నిర్మాతలే కాదు ప్రేక్షకులు కూడా కోరుకుంటారు.
