Site icon NTV Telugu

Jane Fonda: ఆర్ఆర్ఆర్‌పై కామెంట్ చేసింది.. నెటిజన్ల ట్రోలింగ్‌కి బలైంది

Jane Fonda

Jane Fonda

Jane Fonda Criticised For Calling RRR A Bollywood Film: సోషల్ మీడియాలో గానీ, పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గానీ.. సెలెబ్రిటీలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక విషయంపై స్పందించాలనుకుంటే.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని, మాట్లాడితే మంచిది. అరకొర జ్ఞానంతో స్పందిస్తూ మాత్రం.. నెటిజన్లు ఆగ్రహానికి బలి అవ్వాల్సి వస్తుంది. అనవసరంగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు వెటరన్ అమెరికన్ నటి జేన్ ఫాండా కూడా అలాగే ట్రోలింగ్‌కి గురైంది. ఆర్ఆర్ఆర్ సినిమాపై తాను చేసిన కామెంట్ వల్లే, ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి.. తాను పాజిటివ్‌గానే స్పందించింది కానీ, అవగాహన లేమితో చేసిన ఓ చిన్న తప్పు వల్ల ట్రోలింగ్ బారిన పడింది.

Vardhan Puri: అవకాశాలు కావాలంటే.. కోరికలు తీర్చాల్సిందే

ఇంతకీ జేన్ ఫాండా చేసిన పోస్ట్ ఏమిటంటే.. ‘‘నేను చివరగా సిఫార్సు చేసిన ‘టు లెస్లీ’ సినిమాకు పూర్తి విరుద్ధంగా.. ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాను రికమెండ్ చేస్తున్నాను. ఈ సినిమా నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ భారతీయ సినిమా బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యింది. ఇది ఇండియానా జోన్స్, సామ్రాజ్యవాదం, బాలీవుడ్‌ల కాంబినేషన్. ఈ సినిమా నాలో సరికొత్త మార్పుని తీసుకొచ్చింది’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక్కడ ఆమె ఆర్ఆర్ఆర్‌ని చూడమని సిఫార్సు చేసింది. కాకపోతే.. దీన్ని ఒక బాలీవుడ్ సినిమా అని పేర్కొనడమే తప్పైపోయింది. ఇంకేముంది.. వెంటనే నెటిజన్లు ఆమెపై ఎగబడ్డారు. ఇది బాలీవుడ్ సినిమా కాదని, టాలీవుడ్ సినిమా అని ఆమెకు హితబోధ చేస్తున్నారు.

Rashmika Mandanna: వారిసులో ఏం లేదు.. రష్మిక షాకింగ్ కామెంట్స్

కొందరైతే.. ఈ ఆర్ఆర్ఆర్‌కి, ఇండియానా జోన్స్‌కి ఏమాత్రం సంబంధం లేదని చెప్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల పాత్రలతో ఈ సినిమాని రూపొందించారని పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా షేక్ చేస్తున్న విషయం తెలిసిందే! గోల్డెన్ గ్లోబ్ సహా అంతర్జాతీయ పురస్కారాలని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్స్‌లోనూ చోటు దక్కించుకోవాలని చూస్తోంది.

Exit mobile version