Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి ప్రచారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఒక్కసారిగా పవన్ విశ్వరూపం చూపిస్తూ వైసీపీపై విరుచుకుపడ్డారు. ఎప్పుడు లేని విధంగా బూతులు మాట్లాడుతూ తన కోపాన్ని వెళ్లగక్కారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ కళ్యాణ్ అన్నవారికి సరైన సమాధానం చెప్పానని చెప్పారు. తాను మూడు పెళ్లిళ్లు విడాకులు ఇచ్చి, వారికి భరణం కూడా ఇచ్చి విడిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఇక పవన్ వ్యాఖ్యలతో ప్రస్తుతం పవన్ భార్యలకు ఇచ్చిన భరణం హాట్ టాపిక్ గా మారింది. “మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారు.. మీరు చేసుకోండి మూడు పెళ్లిళ్లు.. ఎవరు వద్దన్నారు.. పెళ్లి చేసుకున్న మొదటి భార్యతో వర్క్ అవుట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి, రూ. 5 కోట్లు డబ్బు ఇచ్చి.. తరువాత నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చి, ఆమెకు విడాకులిచ్చి తరువాత నేను మూడో సారి చేసుకున్నాను” అని చెప్పుకొచ్చారు.
ఇక పవన్ భార్యల విషయానికొస్తే.. పవన్ మొదటి భార్య పేరు నందిని.. మెగా కుటుంబం నచ్చి మెచ్చి పవన్ కు నందిని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వీరిద్దరికి వర్క్ అవుట్ అవ్వకపోయే సరికి పవన్ ఆమెకు విడాకులిచ్చాడు. ఆమెకు భరణం కింద రూ. 5 కోట్లు చెల్లించాడు. ఇక బద్రి సమయంలో పవన్, రేణు దేశాయ్ ను ప్రేమించి, లివింగ్ రిలేషన్ చేస్తూ పెళ్ళికి ముందే అకీరాకు జన్మనిచ్చారు. ఆ తరువాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇక కొన్నేళ్ల తరువాత పవన్, రేణు విడిపోయారు. ఆమెకు పవన్ తన ఆస్తిని రాసిచ్చినట్లు ఆయనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ తన మూడో భార్య అన్నా లెజినావో తో కలిసి ఉంటున్నారు.