కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” విడుదలకు భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పునీత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జేమ్స్’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పునీత్ చేసిన యాక్షన్ స్టంట్స్ వీక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు, విజువల్స్ అదిరిపోయాయి. ట్రైలర్ చూస్తుంటే ‘జేమ్స్’ పునీత్ అభిమానులకు తప్పకుండా చిరకాలం గుర్తుండిపోయే మంచి ఫీస్ట్ ఇస్తాడనిపిస్తోంది. J – WINGS అనే సెక్యూరిటీ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న జేమ్స్ అకా సంతోష్ కుమార్ అనే పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఈ హ్యాపీ గో లక్కీ పర్సన్ అకస్మాత్తుగా చీకటి మార్కెట్ లోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతను క్రైమ్ సిండికేట్‌లో చాలా చురుకుగా ఉన్న పవర్ బ్రోకర్లు, వ్యాపారవేత్తలను ఎలా ఎదుర్కొంటాడు. డ్రామా, భావోద్వేగాలు, దేశభక్తితో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘జేమ్స్’. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
Read Also : Spider Man : మేడమ్ టుస్సాడ్స్‌లో హీరోయిన్ స్టాచ్యూ… ఫ్యాన్స్ ఫైర్
‘జేమ్స్’ మూవీ పునీత్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17న థియేటర్లలోకి వస్తుంది. పునీత్ రాజ్ కుమార్‌ను జయంతిని మరింత ప్రత్యేకంగా చేయడానికి, ఆయనను గౌరవించటానికి కర్ణాటక మూవీ డిస్ట్రిబ్యూటర్లు మార్చి 17 నుండి 23 వరకు… ఒక వారం పాటు అక్కడ మరే ఇతర చిత్రాన్ని విడుదల చేయకూడదని ప్లాన్ చేస్తున్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జేమ్స్’లో ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్ ముఖర్జీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పునీత్ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ నిర్మించడమే కాకుండా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 2021లో మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’తో చివరి సారిగా తెరపై కనిపించనున్నారు. ఇక ‘జేమ్స్’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ట్రైలర్ ను కూడా ఈ 5 భాషల్లో విడుదల చేశారు మేకర్స్.