SSMB 29 : సైలెన్స్‌ను కూడా ప్రమోషన్స్ స్ట్రాటజీగా వాడేస్తున్న జక్కన్న.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రూల్. బాహుబలి సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆచార్య చేశాడు చరణ్. ఇప్పుడు SSMB 29 కోసం మహేశ్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అంతే కాదండోయ్ ఈ సినిమాకు సంబంధించి బయట ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు సూపర్ స్టార్. కానీ మిగతా స్టార్స్ మాత్రం రాజమౌళి రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. మహేశ్‌బాబు తప్ప ప్రియాంక చోప్రా, పృద్వీరాజ్ సుకుమారన్ సమయం వచ్చినప్పుడల్లా SSMB 29 గురించి మాట్లాడుతునే ఉన్నారు
Also Read : Exclusive : ఏపీ సీఎంతో సినిమా పెద్దల మీటింగ్.. ఎక్కడివారు అక్కడే గప్ చుప్
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
తాజాగా ప్రియాంక చోప్రా మహేశ్‌బాబు సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నా. కానీ ఇండియాను, హిందీ సినిమాలను చాలా మిస్ అవుతున్నాను. అప్పుడప్పుడు నా సొంత ఇంటికి దూరమయ్యాననే భావన కలుగుతుంటుంది. కానీ ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పలు సందర్భాల్లో ఎస్ఎస్ఎంబీ 29 గురించి మాట్లాడారు. రాజమౌళి సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేనని అన్నారు. కానీ తాను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యాను. అప్పటినుంచి ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నానని తెలిపారు.
Also Read : Bhairavam : తెలుగు, హిందీ భాషల్లో ‘భైరవం’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడు ఎక్కడంటే.?
కానీ మహేశ్ బాబు మాత్రం జక్కన్న గీసిన గీత దాటడం లేదు. ఎస్ఎస్ఎంబీ 29 గురించి బాబు మాట్లాడిన సందర్భాలు లేవు. లుక్ విషయంలోను లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. విదేశాల్లో ట్రైనింగ్‌కు వెళ్లినా కూడా ఎలాంటి లీకేజీ బయటికి రానివ్వలేదు. పూజా కార్యక్రమాలు జరుపుకున్నా, షూటింగ్ మొదలైనా కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పిన రాజమౌళినే చెప్పాలి అన్నట్టుగా.. ఫుల్ స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడు మహేష్. కానీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి.. ఏదో ఓ రకంగా ఇండైరెక్ట్‌గా పోస్ట్‌లు పెడుతునే ఉన్నారు, మాట్లాడుతునే ఉన్నారు. దానికి తోడు లీకేజీలు వదలడం లేదు. ఇప్పటి వరకు రాజమౌళి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పింది ఏమైనా ఉందా అంటే? ఆ మధ్య సింహాన్ని బోనులో బంధించానని, మహేష్ బాబు పాస్‌పోర్ట్ లాక్కున్నాను అంటూ పోస్ట్‌లు చేశాడు. మొత్తంగా..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!