Site icon NTV Telugu

SSMB 29 : సైలెన్స్‌ను కూడా ప్రమోషన్స్ స్ట్రాటజీగా వాడేస్తున్న జక్కన్న.

Ssmb 29

Ssmb 29

రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రూల్. బాహుబలి సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆచార్య చేశాడు చరణ్‌. ఇప్పుడు SSMB 29 కోసం మహేశ్  బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అంతే కాదండోయ్ ఈ సినిమాకు సంబంధించి బయట ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు సూపర్ స్టార్. కానీ మిగతా స్టార్స్ మాత్రం రాజమౌళి రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. మహేశ్‌బాబు తప్ప ప్రియాంక చోప్రా, పృద్వీరాజ్ సుకుమారన్ సమయం వచ్చినప్పుడల్లా SSMB 29 గురించి మాట్లాడుతునే ఉన్నారు

Also Read : Exclusive : ఏపీ సీఎంతో సినిమా పెద్దల మీటింగ్.. ఎక్కడివారు అక్కడే గప్ చుప్

తాజాగా ప్రియాంక చోప్రా మహేశ్‌బాబు సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నా. కానీ ఇండియాను, హిందీ సినిమాలను చాలా మిస్‌ అవుతున్నాను. అప్పుడప్పుడు నా సొంత ఇంటికి దూరమయ్యాననే భావన కలుగుతుంటుంది. కానీ ఇప్పుడు ఓ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పలు సందర్భాల్లో ఎస్ఎస్ఎంబీ 29 గురించి మాట్లాడారు. రాజమౌళి సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేనని అన్నారు. కానీ తాను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యాను. అప్పటినుంచి ఈ ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నానని తెలిపారు.

Also Read : Bhairavam : తెలుగు, హిందీ భాషల్లో ‘భైరవం’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడు ఎక్కడంటే.?

కానీ మహేశ్ బాబు మాత్రం జక్కన్న గీసిన గీత దాటడం లేదు. ఎస్ఎస్ఎంబీ 29 గురించి బాబు మాట్లాడిన సందర్భాలు లేవు. లుక్ విషయంలోను లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. విదేశాల్లో ట్రైనింగ్‌కు వెళ్లినా కూడా ఎలాంటి లీకేజీ బయటికి రానివ్వలేదు. పూజా కార్యక్రమాలు జరుపుకున్నా, షూటింగ్ మొదలైనా కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పిన రాజమౌళినే చెప్పాలి అన్నట్టుగా.. ఫుల్ స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడు మహేష్‌. కానీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి.. ఏదో ఓ రకంగా ఇండైరెక్ట్‌గా పోస్ట్‌లు పెడుతునే ఉన్నారు, మాట్లాడుతునే ఉన్నారు. దానికి తోడు లీకేజీలు వదలడం లేదు. ఇప్పటి వరకు రాజమౌళి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పింది ఏమైనా ఉందా అంటే? ఆ మధ్య సింహాన్ని బోనులో బంధించానని, మహేష్ బాబు పాస్‌పోర్ట్ లాక్కున్నాను అంటూ పోస్ట్‌లు చేశాడు. మొత్తంగా..

Exit mobile version