స్టైల్ సినోనిమ్… ఐకాన్ ఆఫ్ స్వాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోటికి తిరిగొచ్చాడు. తనకి మాత్రమే సాధ్యమైన అసాధారమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి వింటేజ్ వైబ్స్ ని ఇచ్చాడు రజినీకాంత్. భాషా సినిమా కమర్షియల్ మూవీస్ కి ఒక బెంచ్ మార్క్, నరసింహ మాస్ సినిమాల్లోనే ఒక మైల్ స్టోన్… ఆ రేంజ్ ఇంపాక్ట్ ని రజినీ ఆన్ స్క్రీన్ చూపించి చాలా రోజులే అయ్యింది. కబాలి సినిమాతో మాజీ మాఫియా డాన్ పాత్రలో రజినీకాంత్ చేసిన హంగామా, సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. కబాలి నెగటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇండియన్ బాక్సాఫీస్ ని రజినీ మూలాలతో సహా కుదిపేసే వాడు. గత కొంతకాలంగా రజినీ నుంచి ఆ రేంజ్ సినిమా రావట్లేదు, ఒకప్పటి స్వాగ్ కనిపించట్లేదు అనుకుంటున్న ఫాన్స్ కి జైలర్ ట్రైలర్ ఫుల్ మీల్స్ పెట్టింది.
డైరెక్టర్ నెల్సన్ రజినీ సంభవం ఒక రేంజులో చూపించాడు. వింటేజ్ రజినీ లుక్స్ అండ్ స్టైల్-స్వాగ్ జైలర్ ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఈ ఒక్క ట్రైలర్ తో రజినీ ఫాన్స్ అందరికీ కిక్ ఇచ్చిన మేకర్స్, సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసాడు. కబాలిలో రజినీకాంత్ ని ఏకంగా భాషా సినిమాలో రజినీకాంత్ ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చేసారు. సోషల్ మీడియా మొత్తం రజినీ నామస్మరణతో మారుమోగుతోంది. తమిళ్, తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతి చోటా జైలర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. హిట్ టాక్ పడితే మాత్రం టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ చేయబోయే సంభవం కోలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయేలా ఉంటుంది.