NTV Telugu Site icon

Jailer: ఇదేంటి బాసూ రజనీ గాలి ఇట్టా తీసేశారు.. చూసుకోబళ్ళా?

Jailer

Jailer

Jailer producers underreported the Collections: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా నిర్మాతలు అయినా వచ్చిన కలెక్షన్స్ కంటే ఒక 10%, లేదా 20% పెంచుతూ నెంబర్లను ఓవర్‌హైప్ చేస్తుంటారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ నిర్మాతలు మాత్రం రివర్స్‌లో చేసిన పని అభిమానులకు కోపమ్ తెప్పిస్తోంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సన్ పిక్చర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటిదాకా జైలర్ ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఒక పోస్టర్ పోస్ట్ చేసింది. అయితే నిజానికి బాక్స్ ఆఫీస్ ట్రాకర్లు సహా అనేక వెబ్‌సైట్‌లు జైలర్ సినిమా మొదటి వారంలో 400 కోట్లు గ్రాస్‌ను దాటిందని రిపోర్ట్ చేయగా వారందరికీ షాక్ ఇస్తూ నిర్మాతలు 40 కోట్లు తక్కువ వసూలు చేసినట్టు పోస్టర్ వదిలారు. సన్ పిక్చర్స్ తీరుతో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు, అదే సమయంలో తీవ్ర ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు.

Sreemukhi: మొన్న అలా, ఇప్పుడు ఇలా.. చూపిస్తూ కవ్విస్తే తట్టుకోవడం ఎలా శ్రీముఖీ?

అయితే సన్ పిక్చర్స్ ఇచ్చిన అధికారిక బాక్సాఫీస్ నంబర్లు కొన్ని ఓవర్సీస్ ప్రాంతాలను మినహాయించాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మేకర్స్ వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టి మిగతా కలెక్షన్స్ ఎంత వచ్చాయో వాటిని పోస్ట్ చేసి ఉంటారని అంటున్నారు. అందుకే కలెక్షన్ ట్రాకర్లు రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ కంటే తక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేసి ఉంటారని అంటున్నారు. అయితే, బాక్సాఫీస్ పోస్టర్లను విడుదల చేయడానికి ప్రొడక్షన్ హౌస్ ఎందుకు ఆత్రంగా చేయాల్సి వచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కలెక్షన్ల వివరాలన్నింటినీ పొంది, ధ్రువీకరించిన తర్వాతే పోస్టర్‌ను విడుదల చేసి ఉండొచ్చు కానీ తక్కువ కలెక్షన్స్ తో పోస్టర్ వేసి మా పరువు తీసిందని కామెంట్ చేస్తున్నారు.

Show comments