Little Hearts Jai Krishna : అవును.. టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడు. తన మీమ్స్, రీల్స్ టైమింగ్స్ ను సినిమాల్లో చూపిస్తూ దుమ్ము లేపాడు. అతనెవరో కాదు లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోతో సమానంగా ఆకట్టుకున్న జై కృష్ణ. డైరెక్టర్ బుచ్చిబాబు తీసిన ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరో పక్కన చాలా సీన్లలో కనిపించాడు. ఆ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత అతనికి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. పైగా మనోడు ఇన్ని రోజులు చదువుల్లో కొంచెం బిజీగా ఉన్నాడు. ఇన్ని అయినా సరే గ్యాప్ లేకుండా ఇన్ స్టాలో కామెడీ రీల్స్ చేస్తూ భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇన్ స్టాలో మనోడి కామెడీకి మంచి క్రేజ్ ఉంది.
Read Also : Ravali : ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. ఇలా మారిందేంటి..?
ఆ కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్లే అతనికి లిటిల్ హార్ట్స్ లో అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. హీరోతో చివరి సీన్ దాకా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే హీరోతో పాటు జై కృష్ణకు సేమ్ పేరొచ్చింది. లిటిల్ హార్ట్స్ లో జైకృష్ణ కామెడీకి సినిమా చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారు. ప్రమోషన్లలో మనోడు స్టేజ్ ఎక్కితే చాలు అరుపులతో ఊగిపోతున్నారు ప్రేక్షకులు. మనోడి కామెడీకి ఇప్పుడు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దెబ్బకు మనోడు మంచి పాపులర్ అయ్యాడు. చూస్తుంటే వరుస సినిమా ఆఫర్లు రావడం పక్కాగా కనిపిస్తోంది. ఈ లెక్కన టాలీవుడ్ కు ఇంకో కమెడియన్ వచ్చినట్టే అంటున్నారు సినిమా మేథావులు. మనోడికి మంచి టైమింగ్ ఉంది.. దాన్ని వాడుకుంటే సూపర్ భవిష్యత్ ఉంటుంది.
Read Also : Suman Shetty : ఆ డైరెక్టర్ మాట వల్ల కోటీశ్వరుడు అయిన సుమన్ శెట్టి..
