Site icon NTV Telugu

Jai Bhim: వివాదంలో సూర్య- జ్యోతిక.. కేసు నమోదు

Surya

Surya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , అతని భార్య జ్యోతిక మరోసారి చిక్కులో పడ్డారు. సూర్య హీరోగా నటించిన జై భీమ్ .. అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డులకు కూడా ఎన్నికైన విషయం తెలిసిందే. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటి, నిర్మాత జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అందులో ఒకటి సినిమాలో తమ కులాన్ని అవమానించారంటూ వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బ తీశాయని, తమ కులాన్ని,  వృత్తిని కించపర్చేలా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని వారు పిటిషన్ లో తెలిపారు.

ఇక ఈ కేసుపై తాజాగా చెన్నై కోర్టు విచారణ జరిపింది. ఇప్పటివరకు ఏ ఒక్క విచారణకు సూర్య, జ్యోతిక, డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా హాజరుకాలేదని, దీంతో వారి పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురును కోరింది. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసుపై సూర్య, జ్యోతిక ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version