Jagapathi Babu Playing Villain Role In Mahesh Babu SSMB28: మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ‘SSMB28’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తవ్వగా, లేటెస్ట్‌గా రెండో షెడ్యూల్ కూడా మొదలైంది. ఇదిలావుండగా.. సాధారణంగా ఒక సినిమా మొదలైనప్పుడు, ముందుగానే అందులో ప్రధాన పాత్రధారులైన హీరోయిన్, విలన్ వివరాల్ని వెల్లడిస్తారు. ఎవరెవరు ఆ పాత్రల్లో నటిస్తున్నారన్న సమాచారాన్ని రివీల్ చేస్తారు. కానీ.. SSMB28 విషయంలో హీరోయిన్ ఎవరో చెప్పారు గానీ, విలన్ పేరే రివీల్ చేయకుండా మిస్టరీగా పెట్టేశారు. అయితే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో ఓ క్రూరమైన విలన్‌ని దింపినట్టు తెలిసింది. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. జగపతి బాబు.
Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత సూర్యనారాయణరాజు కన్నుమూత
బాలయ్య ‘లెజెండ్’ సినిమాలో జగపతి ఓ క్రూరమైన విలన్ రోల్ పోషించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా నుంచే జగపతి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయన రెండో ఇన్నింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇక త్రివిక్రమ్ రూపొందించిన ‘అరవింద సమేత’లోనూ బసిరెడ్డిగా అదరహో అనిపించారు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాలోనూ విలన్‌గా జగపతినే ఎంపిక చేసినట్టు తెలిసింది. ఆ రెండు సినిమాల్లో.. ముఖ్యంగా బసిరెడ్డి పాత్రలో జగపతి ప్రదర్శించిన విలనిజం నచ్చి, మళ్లీ ఆయన్నే త్రివిక్రమ్ తీసుకున్నట్టు సమాచారం. నిజానికి.. ఈ పాత్ర కోసం మొదట్లో బాలీవుడ్ నుంచి ఎవరినో ఒకరిని దింపాలని అనుకున్నారు. అక్కడ సెట్ కాకపోవడంతో, సౌత్‌లోనూ జల్లెడ పట్టారు. అక్కడా కుదరకపోవడంతో.. ఫైనల్‌గా జగపతినే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సారథీ స్టూడియోస్‌లో మహేశ్‌పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.
Veera Simha Reddy: బాలయ్య ఆ ‘వన్డే’ స్టోరీని వద్దన్నారు.. గోపీచంద్ రివీల్ చేసిన సీక్రెట్
కాగా.. మహేశ్, జగపతి బాబు ఇదివరకే రెండు సినిమాల్లో కలిసి నటించారు. శ్రీమంతుడులో తండ్రికొడుకులుగా చేసిన ఈ ఇద్దరు.. మహర్షిలో హీరో-విలన్లుగా నటించారు. మరి, ఈసారి వీరి కాంబోలో త్రివిక్రమ్ ఎలాంటి సీన్లను రాసుకున్నాడో, ఏ స్థాయిలో అవి ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటాయో చూడాలి. ఇకపోతే.. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం విదితమే! ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు.
USA: హిందూ ఆలయంపై దొంగల దాడి.. విలువైన వస్తువుల అపహరణ