Jabardasth Srividya: ఒకప్పుడు జబర్దస్త్వేరు .. ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ వేరు. ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి ఈ కామెడీ షోను వీక్షించేవారు. కానీ, ఇప్పుడు ఇదొక వల్గర్ షోగా మారిపోయింది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఎబెట్టుగా అనిపిస్తుంది అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ముఖయంగా ఈ షోస్ లో లవర్స్ ను ఎక్కువ క్రేయేట్ చేసి.. వారి మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఏదో ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మిస్తున్నారు. ఇలా సుధీర్ – రష్మీ జంటకు వర్క్ అవుట్ అయ్యింది. ఆ తరువాత ఇమ్మాన్యుయేల్- వర్ష జంట ఓ మాదిరిగా సెట్ అయ్యింది. ఆ తరువాత ఏ జంట అంత క్లిక్ అవ్వలేదు. ఇక ఈ మధ్య బాబు- శ్రీవిద్య మధ్య లవ్ ట్రాక్ ను నడుపుతున్నారు. అందరిలా కాకూండా ఇక్కడ శ్రీవిద్యనే.. బాబు వెనుకాల పడుతున్నట్లు చూపించారు. పటాస్ షో లో తనదైన పంచ్ లతో శ్రీవిద్య గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నిదానంగా జబర్దస్త్ కు వచ్చి సెటిల్ అయ్యింది. ఇక వీరి మధ్య లవ్ ట్రాక్ ఓఎత్తడం.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టడం చెస్ నవ్వు పుట్టించాలని చూస్తున్నారు.
తాజాగా లేటెస్ట్ ప్రోమోలో అందరిముందు స్టేజిపై బాబు పరువు తీసింది శ్రీవిద్య. జనరల్‌గా అబ్బాయిలు వెంటపడతారు, అమ్మాయిలు దూరం పెడతారు. కానీ ఇక్కడ అమ్మాయి వెంటపడుతుంది, అబ్బాయి ఎందుకు దూరం పెడుతున్నాడు అంటూ రష్మీ అడగగా.. శ్రీవిద్య అస్సలు తడుముకోకుండా.. బాబు.. ఉప్పెనలో ఆశీలా మారిపోయాడు. మ్యాటర్ లేదు.. అందుకే దూరం పెడుతున్నాడు అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత నిజంగా మీ మధ్య ప్రేమ ఉందా అని అడిగితే.. బాబు.. నా బాబుకు అవుతావా బాబు అంటూ శ్రీవిద్య చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కామెడీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి.. చాలా దారుణంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
