Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్ లాల్ మలయాళ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ దృశ్యం తెలుగులో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా పార్ట్ 3 తీసుకువస్తున్నాడు మోహన్ లాల్. ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. కానీ ఈసారి ‘దృశ్యం 3‘ తెలుగులో రీమేక్ కావడం లేదు. విక్టరీ వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో మోహన్‌లాల్ నటించిన ఒరిజినల్ మలయాళ వెర్షన్‌నే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ వెర్షన్లు సిద్ధమవుతున్నాయి.
ఈ చిత్రం మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళలో మరియు ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి జార్జ్ కుట్టి మ్యాజిక్ రిపీట్ కాబోతున్నట్లు స్పష్టమవుతోంది. తెలుగు మరియు ఇతర భాషల ట్రైలర్లు, విడుదల తేదీల గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మలయాళ వెర్షన్ విడుదలయ్యే మే 21నే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొదటి రెండు భాగాలు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో వెంకటేష్ లేకపోయినప్పటికీ మోహన్‌లాల్ వెర్షన్‌కు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
- Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
- Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్‌డమ్ ఉరికే రాలేదు
- Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన 'ముట్ట కలక్కి'
తాజావార్తలు
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
-
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత