ఫెస్టివల్ సీజన్ అనగానే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ కి తమ సినిమాలని రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనిపించడం మాములే. సీజన్ ని టార్గెట్ చేస్తే యావరేజ్ సినిమా కూడా హిట్ అవుతుంది, అందుకే ఎక్కువ సెలవలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ వర్గాలు పోటీ పడి తమ సినిమాలని రిలీజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా సంక్రాంతి లాంటి సీజన్ అయితే సినిమాలకి కేరాఫ్ అడ్రెస్. ఈ సీజన్ లో వచ్చినన్ని సినిమాలు, పోటీ పడే స్టార్లు ఇంకో సీజన్ లో కనీసం కనిపించరు. ఎప్పటిలాగే ఈసారి కూడా 2024 సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి హను మాన్, ఈగల్, నా సామీ రంగ, VD 13, లాల్ సలామ్, అయలాన్, సైంధవ్ సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. తమ సినిమాకి డబ్బులు రావాలి, పండగ అంటే ఎక్కువ రోజులు సెలవలు వస్తాయి అని అలోచించి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడంలో తప్పులేదు కానీ ఈ రేసులో మహేష్ బాబు ఉన్నాడనే విషయాన్ని మరిచిపోతున్నట్టున్నారు.
గ్లిమ్ప్స్ కే అంచనాలు పెంచేసిన ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇప్పటికే డ్యూటీ ఎక్కేసాడు. గుంటూరు కారం మాస్ సాంగ్ పూనకాలు తెప్పిస్తుంది, మహేష్ ఈ మధ్య కాలంలో చూడనంత మాస్ గా కనిపిస్తాడు, రాజమౌళి సినిమాల రేంజులో కలెక్షన్స్ ఉంటాయి, సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో వస్తున్నాం అంటూ గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెంచే పనిలో ఉన్నాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా బయటకి వస్తే గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉంటాయి. జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ ని సగానికి పైగా సొంతం చేసుకోవడం గ్యారెంటీ. సో 2024 సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చిన మహేష్ బాబు ఒక్కడు వన్ సైడ్… మిగతా హీరోలంతా ఒక సైడ్ అనేలా బాక్సాఫీస్ వార్ జరగనుంది. అన్ని సినిమాలు కూడా మహేష్‌తోనే పోటీ పడుతున్నామనే ఫీలింగ్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే.. సంక్రాంతికి ఏ కొత్త సినిమా డేట్ అనౌన్స్ చేస్తున్నా.. గుంటూరు కారంతోనే పోటీ అంటున్నారు తప్పా… మిగతా సినిమాల గురించి మాట్లాడడం లేదు కానీ బాబుతో పోటీ అంటే రిస్క్ అనే విషయాన్ని మరిచిపోతున్నారు.