Site icon NTV Telugu

Leo: సూపర్ స్టార్ ని పెట్టుకోని ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు

Leo

Leo

స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే మాటలు కాదు, ఎన్నో కాంబినేషన్స్ చూసుకొని, షెడ్యూల్స్ సెట్ చేసుకొని షూటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రీప్రొడక్షన్ అంతా పక్కాగా జరిగినా కూడా ఇన్ టైములో షూటింగ్ కంప్లీట్ అవుతుందా అంటే 100% అవుతుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రతి స్టార్ హీరో కథా ఇదే, సినిమా అనౌన్స్ చేయడం, స్టార్ట్ చేయడం, అది ఎదో ఒక కారణం వల్ల డిలే అవ్వడం. అయితే దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తూ కూడా లోకేష్ కనగరాజ్ కేవలం ఆరు నెలల్లో షూటింగ్ ని కంప్లీట్ చేసి ఇంప్రెస్ చేస్తున్నాడు. లోకేష్-విజయ్ కాంబినేషన్ లో లియో సినిమా రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ ఆరు నెలల క్రితం స్టార్ట్ అయ్యి, 125 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది అంటే ఆల్మోస్ట్ నాలుగు నెలల పాటు లియో షూటింగ్ అగ్రెసివ్ గా జరిగింది. ఇటీవలే విజయ్ పార్ట్ కంప్లీట్ చేసిన లోకేష్, లేటెస్ట్ గా ప్యాచ్ వర్క్ ని కూడా క్లోజ్ చేసాడు. ఈ సందర్భంగా తన డిపార్ట్మెంట్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లోకేష్ కనగరాజ్, సపోర్ట్ గా నిలిచిన టీమ్ కి థాంక్స్ చెప్పాడు.

మాస్టర్ సినిమాతో సాలిడ్ హిట్ కొడతారు అనుకున్న విజయ్, లోకేష్ కానగరాజ్ ప్రతి ఒక్కరినీ డిజప్పాయింట్ చేసారు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా హీరో విజయ్ క్యారెక్టర్ కి లేకపోవడం, లోకేష్ కానగరాజ్ నుంచి ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ని ఎక్స్పెక్ట్ చేయడం ‘మాస్టర్’ సినిమా రిజల్ట్ కి కారణం అయ్యింది. ఈ మూవీ తర్వాత విజయ్ మళ్లీ లోకేష్ కి సినిమా ఇవ్వడమో అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయ్యి ‘లియో’ సినిమా ఆన్ అయ్యింది. ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ ఒకవేళ LCUలో భాగం అయితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ.

Exit mobile version