యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం “రాపో19”. ఈ ద్విభాషా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుసామి రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ తో పాటు కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “రాపో19” రెగ్యులర్ షూటింగ్ జూలై నెలలో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో ఆది పినిశెట్టితో పాటు పలువురు నటీనటులపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.
Read Also : ‘లవ్ స్టోరీ’ కొత్త ట్రైలర్… డిజిటల్ రిలీజ్ కు రెడీ
రామ్ ఇటీవల జిమ్ లో వ్యాయామం చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. మెడకు బలమైన గాయం కావడంతో రామ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన లేకుండానే సినిమా సెకండ్ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. లింగుసామికి డైరెక్టర్ గా తెలుగులో ఇదే మొదటి మూవీ. ఈ చిత్రంతో రామ్ తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ హిట్, ‘రెడ్’ మూవీతో ప్లాప్ అందుకున్న రామ్ ఈ సినిమాపై నమ్మకాన్ని పెట్టుకున్నాడు.