NTV Telugu Site icon

Tollywood : తెలుగు ఇండస్ట్రీ సెంటిమెంట్ ఫీలవుతుందా..?

Tollywood

Tollywood

ఒకప్పుడు ఔట్ డోర్ షూటింగ్స్ అనగానే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు లేదా వైజాగ్, ఊటీ పర్యాటక ప్రాంతాల్లో వాలిపోయేది సౌత్ సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు పొలాచ్చి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చూపు ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల వైపు చూస్తోంది. కోరాపూట్ జిల్లాల్లోని పలు లొకేషన్లలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి తెలుగు సినిమాలు. పుష్ప2లోని కొన్ని కీ సీన్స్ మచ్ కుండ్, లామ్తాపుట్, డుడుమాలో చిత్రీకరించాడు సుకుమార్. కోరాపూట్ జిల్లాలో ఎత్తైన కొండలు, పచ్చిక బయళ్లు, జలపాతాలు, లోయలు, విశాలవంతమ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ స్విట్జర్లాండ్ అనే పేరొచ్చింది.

Also Read : Kiara Advani : బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ నుండి వైదొలిగిన కియారా..?

దీంతో టాలీవుడ్ చిత్రాలకు కొత్త లోకేషన్ దొరికినట్లయ్యింది. రీసెంట్ ఇండస్ట్రీ హిట్ సంక్రాంతికి వస్తున్నాంలోని కొన్ని సీన్లను కూడా ఒడిశాలోని బల్దా కేవ్ లో చిత్రీకరించాడు అనిల్ రావిపూడి. అలాగే వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న అనుష్క మూవీ ఘాటీ కూడా ఇక్కడ అడవుల్లోనే షూటింగ్ జరుపుకుంది. డియోమోలి, జేపోర్, కోలాబ్, మచ్ కుండ్లలో షూటింగ్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు యావత్ ప్రపంచం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ షూటింగ్ కూడా ఈ అడవులకు షిఫ్ట్ అయ్యింది. డియోమోలి, డుడుమ, ఒనకడిల్లి, తోలోమాలీ ప్రాంతాల్లో షూటింగ్స్ చేస్తున్నారు. రీసెంట్లీ అక్కడకు షిఫ్ట్ కాగా, లీక్ వీరులు కొన్ని వీడియోలను షేర్ చేశారు నెటిజన్లు. పృధ్వీ సుకుమారన్, మహేష్ చిత్రీకరించిన సీన్స్ లీకయ్యి చిత్ర యూనిట్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.ప్రజెంట్ చాలా ప్రికాషన్స్ తీసుకుని షూట్ చేస్తున్నారని సమాచారం. వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని టాక్ నడుస్తోంది. మరీ ఇక్కడే షూటింగ్ జరుపుకున్న పుష్ప2, సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్టుగా మారాయి. చూడబోతే  ఇదొక సెంటిమెంటల్ షూటింగ్ ఏరియాగా మారిపోయేట్లే కనిపిస్తోంది. మరీ ఘాటీ, ఎస్ఎస్ఎంబీ29 కూడా అంతే హిట్ రీసౌండ్స్ తెచ్చుకుంటాయోమో చూడాలి.