Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Is The Rajakar Files Movie Coming

Vijayendra prasad: ‘రజాకార్ ఫైల్స్’ మూవీ రావడం ఖాయమా?

Published Date :July 11, 2022 , 10:53 am
By Subbarao N
Vijayendra prasad: ‘రజాకార్ ఫైల్స్’ మూవీ రావడం ఖాయమా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ వచ్చిన దగ్గర నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం వెండితెరపైకి ఎక్కాలని భావిస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద మరో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Vijayaendra & Bandi Sanjay

Also Read

  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
  • Dragon - Peddi : ఎన్టీఆర్ - రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
Add as a preferred
source on google

ఇదిలా ఉంటే… తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ను పెద్దల సభకు ఎంపిక చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం ఆ పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కలిశారు. విజయేంద్ర ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో బండి సంజయ్ మనసులో ఉన్న ‘రజాకార్ ఫైల్స్’ మూవీ ముచ్చట కూడా వారి మధ్య వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… గతంలో రజాకార్ల ఆగడాలు, అకృత్యాల నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్‌ ‘రాజన్న’ చిత్రం తెరకెక్కించారు. ఇప్పుడు ఆ కథను మరింత శక్తివంతంగా సినిమాగా తీయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ కోరినట్టు తెలుస్తోంది.

మరి ‘రజాకార్ ఫైల్స్’కు విజయేంద్ర ప్రసాద్ కేవలం కథను అందిస్తారా లేకపోతే ఆయనే దర్శకత్వ బాధ్యతలూ వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్ వాల్వ్ అయితే… ఈ మూవీని ‘కశ్మీర్ ఫైల్స్’ తీసిన అభిషేక్ అగర్వాలే నిర్మిస్తారని అంటున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఇలాంటి సినిమాను తీయడానికి చాలానే సమయం పడుతుంది. అతి త్వరలోనే దీనిని ప్రారంభించినా, వచ్చే వేసవి కాలం నాటికి కానీ సిద్ధం కాదు. అయితే… ఈ మధ్యలో తెలంగాణలో శాసన సభ ఎన్నికలు వస్తే… ఈ సినిమాను ట్రంప్ కార్డ్ గా బండి సంజయ్ వినియోగించాలనుకుంటున్నారని, అందువల్ల ‘రజాకార్ ఫైల్స్’ను జనవరి లేదా ఫిబ్రవరి నాటికే విడుదలకు సిద్ధం చేస్తే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ తో చెప్పారని అంటున్నారు. మరి ఈ విషయమై విజయేంద్ర ప్రసాద్ లేదా అభిషేక్ అగర్వాల్ అధికారికంగా ప్రకటిస్తేనే… నిజానిజాలు ఏమిటనేది తేటతెల్లమవుతాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Agarwal
  • bandi sanjay
  • tarun chugh
  • Vijayendra Prasad
  • Vivek Agnihotri

తాజావార్తలు

  • Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!

  • Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌తో కాంగ్రెస్‌లో కలకలం..

  • Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం

  • DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!

  • Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions