Site icon NTV Telugu

షాకింగ్: బిగ్ బాస్ నటి అరెస్ట్..?

sapna choudhary

sapna choudhary

ప్రముఖ డాన్సర్, హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సప్నాచౌదరి అరెస్ట్ కానున్నట్లు సమాచారం అందుతుంది. 2018 అక్టోబర్ 14 2018న లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్ లో డాన్సర్ సప్నా చౌదరిపై కేసు నమోదైన విషయమ తెల్సిందే. లక్నోలోని స్మృతి ఉప్వాన్ లక్నోలో షో లో ఆమె డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది.. ప్రేక్షకులందరూ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి అయినా ఆమె రాకపోవడంతో ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. అయితే దీనిపై టికెట్ కొన్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ టికెట్ డబ్బులు రూ. 300 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ పలువురు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమలాగే వేలాదిమంది ఆ షోకి అటెండ్ అయ్యారని, వారందరి డబ్బును వెనక్కి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ సప్నా చౌదరితో పాటు షో ఆర్గనైజర్స్ జునైద్ అహ్మద్ నవీన్ శర్మ ఇవాద్ అలీ అమిత్ పాండే రత్నాకర్ ఉపాధ్యాయ్ లపై కాసు నమోదు చేశారు. ఈ కేసులో సప్నాచౌదరి అరెస్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version