Site icon NTV Telugu

Bollywood : బాలీవుడ్‌ను శాసించిన కరణ్‌ జోహార్‌ను ఎవరూ లెక్కచేయడం లేదా?

Karan Johar

Karan Johar

ఐరెన్‌ లెగ్‌ జాన్వీ కపూర్‌కు కరణ్‌ జోహార్‌ లైఫ్‌ ఇద్దామనుకున్నాడు. ‘ధడక్‌తో జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్‌ ఈ అమ్మడితో ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ అనే సినిమా నిర్మించి అక్టోబర్‌ 2న రిలీజ్‌ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమేఉంది. ఈ సినిమా విషయంలో కరణ్‌ జోహార్‌లో టెన్షన్‌ మొదలైంది. సినిమా హిట్‌ అవుతుందా  లేదా అన ప్రెషర్‌ కంటే థియేటర్స్‌ దొరకడం లేదన్న బాధ ఎక్కువైపోయింది.

Also Read : Tollywood : సినిమాల రిలీజ్ ను డిసైడ్ చేస్తున్న ఓటీటీ.. స్టార్ హీరో సినిమా రైట్స్ ఇప్పటికి పెండింగ్

సన్నీ సంస్కారి కీ తులసి కుమారితోపాటు కన్నడ పాన్‌ ఇండియా మూవీ ‘కాంతార చాప్టర్‌ 1 విడుదలవుతోంది. హిందీలో కాంతార భారీ హిట్‌  కావడంతో ఇప్పడు రాబోతున్న ప్రీక్వల్‌పై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే మల్టీప్లెక్స్‌ స్క్రీన్స్‌ ఎక్కువగా కాంతార చాప్టర్‌1కు దక్కాయి. దీంతో సన్నీ సంస్కారి కీ తులసి’కి కావాల్సినన్ని థియేటర్స్‌ దక్కపోవడంతో కరణ్‌ జోహార్‌ గొడవ చేస్తున్నాడు.  కరణ్‌ జోహార్‌ సినిమాకు థియేటర్స్‌ దొరక్కపోవడం బీ టౌన్‌లో చర్చకు దారితీసింది. బాహుబలిని హిందీలో రిలీజ్‌ చేసి పాన్‌ ఇండియాకు తెరలేపిన కరణ్‌కు అదే పాన్‌ ఇండియా మూవీ ‘కాంతార చాప్టర్‌1’ నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. కనీసం థియేటర్స్‌ ఇవ్వాలని అడిగే పరిస్థితికి కరణ్‌ వచ్చాడు.  జాన్వి కపూర్‌ కెరీర్‌ మొదలై అప్పుడే ఏడేళ్లు గడిచిపోయింది. డెబ్యూ మూవీ ధడక్‌ హిట్‌ అయినా ఆతర్వాత హిందీలో ఒక్క హిట్‌ చూడలేదు. దేవర హిట్‌ అయినా ఎన్టీఆర్ కే ఎక్కువ క్రెడిట్ దక్కింది. దసరాకు వస్తున్న సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అయినా హిట్‌ ఇస్తుందనుకుంటే అసలుకే మోసం అన్నట్టు థియేటర్సే దొరకడం లేదు. మరోవైపు వరుణ్‌ధావన్‌తో కలిసి జాన్వి వీర లెవెల్లో ప్రమోషన్‌ చేస్తోంది. రిజల్ట్ ఏంటో మరికొన్ని గంట్లల్లో తెలుస్తుంది.

Exit mobile version