NTV Telugu Site icon

Kalyan Dev: మెగాస్టార్ అల్లుడు మూడో పెళ్లి చేసుకుంటున్నాడా.. ?

Dev

Dev

Kalyan Dev: మెగాస్టార్ అల్లుడు.. కళ్యాణ్ దేవ్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.. వీరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది. ఇక మెగా అల్లుడు అయ్యాకా విజేత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. గత కొన్ని రోజుల నుంచి శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ తాజాగా కళ్యాణ్ దేవ్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. ఆ అనుమానాలకు ఆజ్యం పోసింది కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా పోస్ట్.. అమ్మాయి ఫోటోను షేర్ చేస్తూ “నా లైఫ్ ని మార్చేసిన కళల రాణి” అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఆమెతో కళ్యాణ్ దేవ్ పెళ్లి జరగబోతుందా..? ఈ మాటలకు అర్ధమేంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

కాగా ఇప్పటికే కళ్యాణ్ దేవ్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి.. రెండో భార్యగా శ్రీజను వివాహమాడాడు.. ఇప్పుడు ఈ వార్త నిజమైతే ఇది అతనికి మూడో పెళ్లి.. ఇకపోతే ఆ అమ్మాయి గురించి ఆరా తీసిన నెటిజన్స్ ఆమె పేరు వర్ణిక రాథోర్ అని కనిపెట్టేశారు.. వారితో పాటు ఇంకో అమ్మాయి పేరు అంకిత.. వీరిద్దరూ హీరోయిన్స్ అండ్ మోడల్స్.. దీని బట్టి ఇది పెళ్లి మ్యాటర్ కాదని, సినిమాకు సంబంధించిన డిస్కషన్ అని చెప్పుకొస్తున్నారు. త్వరలోనే కళ్యాణ్ దేవ్ ఒక కొత్త సినిమాను మొదలపెట్టపోతున్నాడట. అందులో హీరోయిన్స్ గా వర్ణిక, అంకిత ఎంపిక అయ్యారని తెలుస్తోంది. మరి కళ్యాణ్ దేవ్ చెప్పిన మాటలకు అర్ధం ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. మరి మెగా అల్లుడు ఈ మాటలకు, ఈ పోస్ట్ కు అర్ధం ఏంటో కళ్యాణ్ దేవ్ మాత్రమే చెప్పాలి.

Show comments