పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమంటూ చాలాసార్లు బండ్లన్న బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక మొన్నటికి మొన్న భీమ్లా నాయక్ వేదికపై బండ్ల గణేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఉంటుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఆ తరువాత జనసేన ఆవిర్భావ సభలో తానూ పాల్గొంటామని బండ్లన్న ట్వీట్ వేయడంతో అక్కడ మిస్ అయినా ఈ వేదికపై ఆయన స్పీచ్ మిస్ అవ్వదు అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బండ్లన్నకు రాజకీయాలు కొత్తేమి కాదు. ఒక్కసారి రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి, దెబ్బ తిని ఇప్పుడు తన పని తాను చూసుకుంటున్నాడు.
ఇక తాజాగా జనసేనలో నేను లేనా..? అని బండ్ల గణేష్ ట్వీట్ చేయడంతో మరోసారి ఆయన పొలిటికల్ ఎంట్రీపై వార్తలు గుప్పుమంటున్నాయి. “చిరంజీవి గారు జనసేన లోకి రావాలి పార్టీని అధికారం లోకి తేవాలి. మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించాలి. అంధకారం లో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలి. రాముడు లోని సౌమ్యం మీరు లక్ష్మనుడి లోని తెగింపు తమ్ముడిది. ఇద్దరు కలిస్తే శ్రీరామ రాజ్యం అవుతుంది. జై జనసేన జై పవన్ కళ్యాణ్” అని ఒక అభిమాని చేసిన ట్వీట్ కి బండ్ల గణేష్ మరి నేను అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో జనసేనలో బండ్ల గణేష్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా..? లేక జనసేనలో జాయిన్ అవ్వడానికి బండ్ల గణేష్ ప్రయత్నాలు చేస్తున్నాడా..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
