NTV Telugu Site icon

Pre release: వెండితెర ‘ఐపీఎల్’కు రంగం సిద్థం!

Ipl

Ipl

IPL: విశ్వ కార్తికేయ, నితిన్ నాష్‌, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ‘ఐపీఎల్’. ఈ సినిమా 10వ తేదీ విడుదలవుతున్న సందర్భంగా ప్రీ-రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ, ”ఈ సినిమా టీమ్ చాలా కష్ట పడ్డారు. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. వేంగి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి” అని అన్నారు. నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ, ”నిర్మాత బీరం శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాను. హీరో విశ్వ కార్తికేయ, హీరో నితిన్ నాష్ ఇద్దరూ జెమ్స్! ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది. వాళ్ళు పడిన కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్ర కథానాయకుల్లో ఒకరైన విశ్వ కార్తికేయ తండ్రి రామాంజనేయులు తనకు మిత్రులని, కష్టపడి తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని తాను ఆకాంక్షిస్తున్నానని నిర్మాత బెక్కెం వేణు అన్నారు. తనకు నిజ జీవితంలో అన్నతమ్ముడు లేరని, అన్నీ తనకు వేంగి సుధాకరేనని, అతనే తనను ఇండస్ట్రీకి పరిచయం చేశాడని, అందుకే ఈ చిత్రంలో ఓ పాటను పాడానని రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. నిర్మాతలు చక్కని సహకారం అందించారని, పాటలు మంచి విజయం సాధించాయని వేంగి సుధాకర్ తెలిపాడు. క్రికెట్ ను, తీవ్రవాదాన్ని మిళితం చేస్తూ ‘ఐపీఎల్’ మూవీ తెరకెక్కించామని దర్శకుడు సురేశ్ లంకలపల్లి చెప్పాడు.

ఈ కార్యక్రమంలో హీరోలు విశ్వ కార్తికేయ, నితిన్ నాశ్‌, హీరోయిన్ అవంతికతో పాటు రచ్చ రవి, ఉదయభాస్కర్, విక్రమాదిత్య, నిర్మాత బీరం శ్రీనివాస్ తదితరులు ప్రసంగిస్తూ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను సుమన్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, డిఎస్ రావు, అమిత్, మిర్చి మాధవి, కిన్నెర, ‘ఈ రోజుల్లో’ సాయి, రామ్ ప్రసాద్ తదితరులు పోషించారు.

Show comments