Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమకు ‘సమ్మర్’ అంటే ఒకప్పుడు కాసుల వర్షం కురిపించే సీజన్. పాఠశాలలకు సెలవులు, ఎండల ధాటికి సాయంత్రం వేళల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు బాక్సాఫీస్‌ను షేక్ చేసేవారు. ‘అడవి రాముడు’ నుండి మొన్నటి ‘బాహుబలి’, ‘ఖుషీ’, ‘పోకిరి’ వరకు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమాలన్నీ వేసవిలోనే సందడి చేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు సినిమాలకు అడ్డాగా ఉన్న సమ్మర్ ఇప్పుడు స్టార్ హీరోలను సైతం భయపెడుతోంది. దీనికి ప్రధాన కారణం IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్).
క్రికెట్ ఫీవర్ కారణంగా పెద్ద సినిమాలు పోటీకి రావడానికి జంకుతున్నాయి. చిరంజీవి ‘విశ్వంభర’, యశ్ ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రాలతో పాటు సమంత ‘మా ఇంటి బంగారం’, నిఖిల్ ‘స్వయంభు’ వంటి సినిమాలు సైతం తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఐపీఎల్ ముగిసే వరకు థియేటర్లకు ఆడియన్స్ రావడం కష్టమని భావించి మేకర్స్ తమ చిత్రాలను జూన్‌కు పోస్ట్‌పోన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే రెండు నెలల పాటు థియేటర్లు వెలవెలబోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు ఐపీఎల్‌లో రోజుకు రెండు మ్యాచ్‌లు ఉంటున్నాయి. దీనివల్ల థియేటర్లలో మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షోలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటీవల విడుదలైన ‘ధురంధర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా కూడా వీకెండ్ కలెక్షన్ల విషయంలో ఐపీఎల్ దెబ్బకు తలవంచక తప్పలేదు. అలాగే ‘రాకాస’, ‘బైకర్’ వంటి చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ క్రికెట్ మత్తులో ఉన్న ఆడియన్స్‌ను థియేటర్ల వరకు రప్పించలేకపోతున్నాయి. కేవలం క్రికెట్ మాత్రమే కాదు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మార్చిలో పరీక్షలు ఉండటంతో ఫిబ్రవరి నుండి మే వరకు సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలంగా మారింది. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్లకు వేదికైన సమ్మర్ ఇప్పుడు ఐపీఎల్ మరియు పరీక్షల కారణంగా ‘అన్‌సీజన్’గా మారిపోయింది. ఈ కష్టాల నుండి గట్టెక్కాలంటే ఐపీఎల్ ముగిసే వరకు వేచి చూడాల్సిందేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?