Site icon NTV Telugu

Saindhav: చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్!

Saindhav Sara Poster

Saindhav Sara Poster

Introducing Sara As Gayathri The Heart Of Saindhav: విక్టరీ వెంకటేష్ మంచి జోష్ మీదున్నారు. ఆయన తన 75వ ల్యాండ్‌మార్క్ సినిమాగా ‘సైంధవ్‌’ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన లుక్ ఒకదాన్ని సినిమా నుంచి రిలీజ్ చేయగా ఇప్పుడు ఆయన ఎమోషన్స్ ను పరిచయామ్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అసలు విషయం ఏమిటంటే సినిమాలో సారా అనే పాత్ర పోషిస్తున్న సారా అనే పాపతో వెంకటేష్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌ లో పాప వెంకటేష్‌ ను కౌగిలించుకోవడం కనిపిస్తుండగా ఆయనకు గాయాలయినట్టు కూడా కనిపిస్తోంది. అయితే ఇంత చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Anasuya Bharadwaj: హద్దులు చెరిపేసిన అనసూయ.. వామ్మో ఈ అందాల ఆరబోత నెవర్ బిఫోర్!

ఇక ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాలు అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వెంకటేష్ కెరియర్లో ది బెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్‌ థ్రిల్లర్ గా సైంధవ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ వికాస్ మాలిక్ క్యారెక్టర్ లో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు సహా హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

Exit mobile version