NTV Telugu Site icon

Tripti Dimri: ఆ సీన్స్ చూసి నా తల్లిదండ్రులు చాలా హర్టయ్యారు.. అలాంటి పని చేస్తానని అనుకోలేదు.. కొత్త నేషనల్ క్రష్ సంచలన వ్యాఖ్యలు

Tripti Dimri On Intimate Scenes

Tripti Dimri On Intimate Scenes

Intimate Scenes Hurted My Parents deeply Says Tripti Dimri: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చి పడుతున్నాయి. ఈ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా మొత్తం మీద జోయా అనే పాత్రలో నటించిన తృప్తి డిమ్రీ మాత్రం సూపర్ హైలైట్ అయింది. ఇక అంతకు ముందే ఆమె పలు సినిమాల్లో నటించింది కానీ ఆమెకు ఈ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు ఆమె ఇన్స్టాగ్రామ్ లో సుమారు 600K ఫాలోవర్లను కలిగి ఉండగా ఇప్పుడు, ఆమెకు 3.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక ఈ సినిమాలో తృప్తి డిమ్రీ రణబీర్ కపూర్ మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.

SVCC 37: సిద్ధూ- భాస్కర్ మొదలెట్టేశారు!

ఇక తాజాగా తృప్తి డిమ్రీ యానిమల్‌లోని తాను నటించిన ఇంటిమేట్ సీన్స్ విషయంలో తన తల్లిదండ్రులు ఎలా స్పందించారో ఆమె వెల్లడించింది. “ ఆ ఇంటిమేట్ సన్నివేశాలు చూసి నా తల్లిదండ్రులు బాధపడ్డారు, నేను అలాంటి పని చేస్తానని వారు ఊహించలేదు, ఇంతకు ముందు ఏ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశాలు చూడలేదని వారు చెప్పారు. నేను అలాంటి సన్నివేశాలు చేయకూడదని వారు అభిప్రాయపడ్డారు, అలాంటి సన్నివేశాలలో నన్ను తెరపై చూసినప్పుడు వారు బాధపడ్డారని చెప్పారు’’ ఈ మేరకు తృప్తి తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఇలాంటి సన్నివేశాలు తన వృత్తిలో భాగమని, తానేమీ తప్పు చేయలేదని చెప్పి తల్లిదండ్రులను శాంతింపజేశానని తృప్తి డిమ్రీ పేర్కొంది. తన పాత్ర – సినిమాలోని కొన్ని సన్నివేశాల వల్ల కలిగిన కల్చరల్ షాక్‌తో తన తల్లితండ్రులు ఇంకా తేరుకోలేదని తృప్తి డిమ్రీ వెల్లడించింది.

Show comments