Interesting Update On KGF 3: కేజీఎఫ్.. భారత చిత్రసీమలోని బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీలలో ఇది ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగం క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చాడు. కానీ.. మూడో భాగం ఎప్పుడు ఉంటుంది? అనే విషయంపైనే స్పష్టత లేదు. ఇప్పుడు ఆ మిస్టరీకి తెరపడింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. సలార్, ఎన్టీఆర్31 ప్రాజెక్టులు ముగిసిన వెంటనే కేజీఎఫ్3ని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. తన ‘నీల్ వర్స్’లో భాగంగా ఈ మూడు సినిమాలకూ లింక్ ఉంది కాబట్టి, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎన్టీఆర్31 సినిమా పూర్తైన వెంటనే కేజీఎఫ్3ని తెరకెక్కించనున్నట్టు వార్తలొస్తున్నాయి. 2024 చివర్లో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి, 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
No Tax In Gold: భారతీయులకు గుడ్ న్యూస్.. బంగారంపై పన్ను లేదు..!
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ 28వ తేదీన దీనిని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని కూడా రెండు భాగాల్లో ప్లాన్ చేశారు. సలార్ రిలీజైన వెంటనే ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్‌ని ప్రశాంత్ నీల్ మొదలుపెట్టనున్నాడు. 2024 చివర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేలా పక్కా స్కెచ్ వేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆ వెంటనే కేజీఎఫ్3 ప్రాజెక్ట్ ప్రారంభించాల్సి ఉంటుంది కాబట్టి, తారక్ సినిమాను తక్కువ సమయంలోనే కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి, ఈ ప్రాజెక్టుల నడుమ ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ఎప్పుడు తీస్తాడన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న. చూద్దాం.. ఈ డైరెక్టర్ ఎలాంటి ప్లాన్ వేశాడో?
Couple In Bathroom: హోలీ ఆడి బాత్ రూం కెళ్లారు… డెడ్ బాడీలుగా తిరిగివచ్చారు