Site icon NTV Telugu

Alia Bhatt-Ranbir Kapoor : పెళ్లి తేదీ వెనుక ఇంట్రెస్టింగ్ లాజిక్ !

Alia-and-Ranbir

Alia-and-Ranbir

బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్‌ల వివాహానికి సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ పెళ్లి తేదీ, దానికి సంబంధించిన లాజిక్ ఆసక్తికరంగా మారాయి. రణబీర్ కపూర్, అలియా భట్‌ల వివాహం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆరోజు దగ్గరకు వచ్చిందని అంటున్నారు. చెంబూర్‌లోని కపూర్‌ల పూర్వీకుల ఇల్లు ‘ఆర్కే హౌస్’లో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్ 13న రణబీర్ కపూర్ ఫ్యామిలీ మెహందీ ఫంక్షన్ RK హౌస్‌లో జరగనుంది. అయితే ఏప్రిల్ 15న అలియా రణబీర్ కపూర్‌ వివాహం జరగనుందని సమాచారం.

Read Also : Maa Ishtam : ప్రమోషన్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ని వాడేస్తున్న ఆర్జీవీ

పంజాబీ సంప్రదాయం ప్రకారం 15వ తేదీ రాత్రి అంటే 16వ తేదీ తెల్లవారుజామున 2 AM నుండి 4 AM మధ్య ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే 16వ తేదీని పెళ్లి తేదీగా ఎందుకు నిర్ణయించారు ? అంటే… రణబీర్ కపూర్ 8ని లక్కీ నెంబర్ గా భావిస్తాడు. అయితే 8కి, పెళ్లి తేదికి సంబంధం ఏంటంటే… 16 (తేదీ)+4(నెల)+2022(సంవత్సరం)=2042… 2042ని విడిగా చూస్తే 2+0+4+2… ఈ మొత్తాన్ని కూడితే 8 అవుతుంది. ఇదే పెళ్లి తేదీ వెనకున్న అసలైన లాజిక్ !

వివాహ వేడుకల తేదీలు :
పెళ్లి వేడుకలు ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. 13వ తేదీన బాంద్రాలోని అలియా ఇంట్లో మెహందీ కార్యక్రమం జరగనుంది.
14వ తేదీన హల్దీ/సంగీత్
15వ తేదీన పెళ్లి
చెంబూర్‌లోని ఆర్కే హౌస్‌లో రిసెప్షన్ జరగనుంది. దీనికి సంబంధించిన తేదీని ఇంకా నిర్ణయించలేదు.

Exit mobile version