NTV Telugu Site icon

Bunny: ఏకంగా ఇన్స్టాగ్రామ్ దిగొచ్చింది.. దేశంలోనే మొదటి హీరో… ఇది బ్రాండ్ అంటే

Bunny

Bunny

మెగా ఫ్యామిలీ హీరో… స్టైలిష్ స్టార్… అనే పిలుపుల నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్, పుష్పరాజ్ క్యారెక్టర్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి బౌండరీలు దాటి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. సౌత్ నుంచి నార్త్… అక్కడి నుంచి ఏషియన్ కంట్రీస్ కి అల్లు అర్జున్ మేనియా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ మేనరిజమ్స్ ని రీక్రియేట్ చేస్తున్నారు అంటే బన్నీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్, ఈ అఛీవ్మెంట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్రకెక్కాడు. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. లేటెస్ట్ గా అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా నుంచి కూడా దాటింది అని నిరూపిస్తూ ఇన్స్టాగ్రామ్ హైదరాబాద్ కి వచ్చింది. దాదాపు 680 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ లో ఎవరి వీడియోస్ పడితే వారి వీడియోస్, ఎవరి ఫొటోస్ పడితే వారి ఫొటోస్ ని షేర్ చేయరు. చాలా రేర్ గా సెలబ్రిటీల ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు, అలాంటి ఇన్స్టాగ్రామ్… హైదరాబాద్ కి వచ్చి అల్లు అర్జున్ తో కోలాబ్ అయ్యి వీడియో షూట్ చేసారు. అల్లు అర్జున్ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? షూటింగ్ లో ఎలా ఉంటాడు అని డైలీ రొటీన్ ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ లో షేర్ చేసారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఇండియన్ హీరో అల్లు అర్జున్ మాత్రమే.

ఇన్స్టాగ్రామ్ షేర్ వీడియోలో అల్లు అర్జున్ ఉదయాన్నే లేచి, యోగా చేసి, ఒక కాఫీ తాగి షూటింగ్ కి వెళ్లడంతో మొదలయ్యింది. తన గార్డెన్ ని చూపిస్తూ అల్లు అర్జున్ తన డైలీ రొటీన్ గురించి చెప్పాడు. షూటింగ్ కి వెళ్లే సమయంలో ప్రతి రోజు మధ్యాహ్నం ఒకటికి ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి మాట్లాడడం, తన అలవాటు అని చెప్పిన బన్నీ వీడియో కాల్ చేసి అర్హ, అయాన్ తో మాట్లాడాడు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కి వెళ్లిన అల్లు అర్జున్… పుష్ప 2 తన బిగ్గెస్ట్ ఫిల్మ్, పార్ట్ 2 ఇంకా ఎక్కువ నచ్చుతుందని చెప్పాడు. ఈ వీడియోలో పుష్ప 2 షూటింగ్ కి సంబందించిన గ్లిమ్ప్స్ ని, సుకుమార్ బైట్ ని, ఫ్యాన్స్ అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్న క్లిప్ ని కూడా అటాచ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అతి తక్కువ సమయంలోనే వన్ మిలియన్ లైక్స్ ని కూడా క్రాస్ చేసిన ఈ వీడియో, వరల్డ్ వైడ్ ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ. ఇప్పుడే బన్నీ క్రేజ్ ఇలా ఉంటే పుష్ప 2 సినిమాకి ఇంకే రేంజులో ఉంటుందో చూడాలి.