Michael: కంటెంట్, మేకింగ్ పరంగా ‘మైఖేల్’కు యూనివర్సల్ రీచ్: సందీప్ కిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan: హీరో సందీప్ కిషన్ రొమాంటిక్ యాక్షన్-ప్యాక్డ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీన్ని భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ‘మైఖేల్’ మూవీ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
తొలుత సందీప్ కిషన్ మాట్లాడుతూ, ”ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం. అద్భుతమైన నటీనటులు ఈ సినిమా కోసం కలసి వచ్చారు. మేమందరం కథని, దర్శకుడు రంజిత్ ని బలంగా నమ్మాం. మా నమ్మకాన్ని ట్రైలర్ కి వచ్చిన స్పందనే నిలబెట్టింది. నిర్మాత భరత్ చౌదరి అద్భుతమైన వ్యక్తి. సినిమా ఈ రోజు ఇంత పెద్దగా మారిందంటే దానికి కారణం ఆయనే. అలాగే సునీల్ గారు, రామ్ మోహన్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి అన్ని కలిసొచ్చాయి. కథ, కంటెంట్, ఫిల్మ్ మేకింగ్ పరంగా మైఖేల్ యూనివర్సల్ గా రీచ్ అయ్యే సినిమా. చాలా ఒర్జినల్ ఫిల్మ్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అని అన్నారు. దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ, ” ఈ మూవీ కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేశాం. ముఖ్యంగా సందీప్, దర్శకుడు రంజిత్ ఫిజికల్ గా, మెంటల్ గా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ టీంతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే వరుణ్ సందేశ్ సరికొత్త స్వాగ్ తో తెరపై కనిపిస్తారు” అని తెలిపింది. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ”ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. సందీప్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా సందీప్ కోసం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో సందీప్ నెక్స్ట్ లీగ్ కి వెళ్తాడని చాలా నమ్మకంగా వున్నాను” అని అన్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
దర్శకుడు రంజిత్ జయకోడి మాట్లాడుతూ, ”నేను తమిళ్ లో మూడు సినిమాలు చేశాను. తెలుగులో ‘మైఖేల్’ నా మొదటి చిత్రం. ఇందులో యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ వుంటాయి. సందీప్ ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అది తెరపై కనిపిస్తుంది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా ఉన్నతంగా వుంటుంది. కిరణ్ కౌశిక్ అద్బుతమైన విజువల్స్ ఇచారు. అలాగే సామ్ సిఎస్ మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని భారీ నిర్మించారు” అని చెప్పారు. నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ, ”సందీప్ కిషన్ గారికి సినిమా తప్పా మరో ధ్యాస వుండదు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ప్రేక్షకులు ఆల్రెడీ ట్రైలర్ లో చూశారు. దర్శకుడు రంజిత్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లాంటి లెజండ్స్ తో కలసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వరుణ్ సందేశ్, దివ్యాంశ, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ… ఇలా చాలా మంచి నటులు ఇందులో భాగమయ్యారు. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం, బిజినెస్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. సినిమాకి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. సినిమాపై నమ్మకంగా వెళుతున్నాం. ఖచ్చితంగా సక్సెస్ కొడతాం” అని అన్నారు. మరో నిర్మాత పుస్కూర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ, ”దర్శకుడు రంజిత్ ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా చేద్దామని చెప్పాం. సందీప్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా విషయంలోనే కాదు పబ్లిసిటీతో పాటు మిగతా అన్ని విషయాల్లో ఆయన ఎంతో ఆసక్తితో ఇన్వాల్ అయ్యి వర్క్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వరుణ్ అద్భుతంగా చేశాడు. హీరోయిన్ దివ్యాంశ క్యూట్ గా వుంది” అని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..