యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ “డీజే టిల్లు” హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. “గుంటూరు టాకీస్”లో తన నటనకు ప్రశంసలు అందుకున్న ఈ హీరో “కృష్ణ అండ్ హిజ్ లీలా”, “మా వింత గాథ వినుమా” సినిమాలతో ఓటిటిలో సందడి చేశాడు. ఈ సినిమాలను ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న “డీజే టిల్లు” బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు సిద్ధు.
Read Also : Godfather : మేజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
తాజాగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ”ఈరోజు పెన్, దాని శక్తి గెలిచింది. మిమ్మల్ని ఇలా నవ్వించాడని మేము మా బాయ్స్ చాలా ఏడ్చాము. ఈ సాయంత్రం కోసం నేను 12 సంవత్సరాలు వేచి ఉన్నాను. గుంటూరు టాకీస్ 12 ఏళ్ల క్రితం విడుదలైంది. ఆ సినిమా హిట్ అయినప్పటికీ… ‘పెళ్లి చూపులు’ తర్వాత విజయ్ దేవరకొండకి, ‘క్షణం’ సినిమా తర్వాత అడివి శేష్‌కి వచ్చినంత బ్రేక్ నాకు రాలేదు. కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను ప్రమోట్ చేయమని ఓ స్నేహితుడిని చాలా రోజులు అడిగాను. కానీ ఒకరోజు అతను నీ గురించి రాస్తే ఎవరూ చదవరు అన్నారు. అప్పుడు నేను ఒక విషయం నిర్ణయించుకున్నాను. మీ గురించి ఎవరైనా వార్తలు రాయకపోతే మీరే వార్తగా మారండి. కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా సినిమాలకు మంచి స్పందన వచ్చింది. “డీజే టిల్లు” వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది” అంటూ సినిమా విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక “డీజే టిల్లు” ఇప్పటికే అన్ని ప్రాంతాలలో ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది. బ్లాక్ బస్టర్ టాక్ ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాత నాగ వంశీ అండ్ టీం సినిమాని ఇంకా గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు.